అందుకే ఓకే చేయడం లేదంటోన్న చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు ఎసరుపెట్టేందుకు చరణ్ రెడీ అవుతున్నాడు.

 Ram Charan Clarity On Not Signing New Project, Ram Charan, Rrr, Acharya, Tollywo-TeluguStop.com

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా తరువాత చరణ్ ఏ సినిమాలో నటిస్తున్నాడా అనే ఆసక్తి మెగా ఫ్యాన్స్‌లో నెలకొంది.

కాగా ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా తరువాత సోలో హీరోగా చరణ్ ఏ సినిమాలో నటిస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

రంగస్థలం చిత్రం తరువాత చరణ్ ఇప్పటివరకు సోలో చిత్రాన్ని ఓకే చేయలేదు.దీనికి గల కారణమేమిటో చరణ్ తాజాగా తెలిపాడు.

ఆయన నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై తన పూర్తి ఫోకస్ పెట్టినట్లు చిత్ర రామ్ చరణ్ అంటున్నాడు.అటు ఆచార్య సినిమాకు తాను నిర్మాతగా ఉండటంతో, ఆ సినిమాను కూడా చాలా జాగ్రత్తగా తెరకెక్కించే పనులు తాను దగ్గరుండి చూస్తున్నానని, అందుకే ఇప్పటివరకు తన నెక్ట్స్ మూవీని ఓకే చేయలేదని చరణ్ అంటోన్నాడు.

ఏదేమైనా చరణ్ తన నెక్ట్స్ మూవీని ఎందుకు ఓకే చేయలేదనే విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube