నిన్న, నేడు.. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్‌ 'ఆచార్య'?

మెగా స్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమా విడుదల తేదీ అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు.చిత్ర యూనిట్ సభ్యులు సినిమా కు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించేందుకు మల్ల గుల్లాలు పడుతున్నారు.

 Ram Charan Chiranjeevi Acharya Movie Release Date , Acharya, Chirejeevi, Flim Ne-TeluguStop.com

ఇప్పటి వరకు చాలా విషయాల్లో క్లారిటీ లేకుండా ఉంది.అంటే ఏ సినిమాలు ఎప్పుడు వస్తాయి.

నిర్మాతల మండలి సూచన ప్రకారం చాలా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ కాకుండా ఒకే సారి కాకుండా కనీసం వారం గ్యాప్ అయినా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.అందుకే మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమాకు వారు ఎప్పుడు అవకాశం ఇస్తారు అనేది ఆసక్తిగా మారింది.

ఒక వేళ మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమాను సంక్రాంతికి తీసుకు వస్తే పరిస్థితి ఏంటీ అనే విషయంలో చాలా చర్చలు జరిగాయి.ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

ఇతర హీరోలకు పోటీ రాకుండా.మరీ ఆలస్యం కాకుడా సినిమాను కరెక్ట్‌ టైమ్‌ కు తీసుకు వచ్చేందుకు గాను ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Telugu Acharya, Chiranjeevi, Ram Charan-Movie

నిన్న ఆచార్య విడుదల తేదీకి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు రాగా.ఆ తర్వాత నేడు అన్నారు.ఏవో కారణాలు చెబుతూ సినిమాను అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తున్నారు.సినిమా షూటింగ్‌ ను కరోనా వల్ల ఆలస్యం చేశారు.ఇప్పుడు విడుదల తేదీ విషయంలో కూడా కరోనా ఎఫెక్ట్‌ కనిపిస్తుంది.పదుల సంఖ్యలో పెద్ద హీరోల సినిమాల మద్య ఆచార్య ను ఒక మంచి సమయం చూసి విడుదల చేయాలని ఆశ పడుతున్నారు.

అందుకోసం పెద్ద ఎత్తున అంచనాలు మరియు పెద్ద ఎత్తున అభిప్రాయాలను ఆచార్య మోయాల్సి వస్తుంది.కాజల్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో చరణ్‌ కీలక పాత్రలో నటించాడు.

ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే కీలక పాత్రలో కనిపించబోతుంది.సంగీత కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రను చేయడం వల్ల ఆసక్తి పెరిగింది.

మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా నుండి ఇప్పటికే ఒక పాట వచ్చింది.ఆ పాట మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube