ఆచార్య కోసం చరణ్ ఎంత పుచ్చుకుంటున్నాడంటే?  

Ram Charan Charges Rs 15 Cr For Acharya - Telugu Acharya, Chiranjeevi, Koratala Siva, Ram Charan, Telugu Movie News

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 Ram Charan Charges Rs 15 Cr For Acharya

ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.అయితే ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో మహేష్ నటించనున్న పాత్ర ఎలా ఉంటుందా అని అందరూ అనుకున్నారు.కానీ ఇంతలోనే మహేష్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు.మహేష్ ఈ సినిమా నుండి తప్పుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి.అయితే ఈ సినిమాలో మహేష్ చేయబోయిన పాత్రలో ఎవరు నటిస్తారా అనే అంశంపై చిత్ర యూనిట్ అప్పుడే క్లారిటీ ఇచ్చేసింది.

ఆచార్య కోసం చరణ్ ఎంత పుచ్చుకుంటున్నాడంటే-Gossips-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో కేమియో పాత్రలో నటించేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒప్పుకున్నాడని ఆచార్య టీమ్ తెలిపింది.

కాగా ఈ సినిమాలో నటించేందుకు గాను చరణ్ ఏకంగా రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నాడట.భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test