విరూపాక్ష సాక్షిగా రామరాజు ఎంట్రీ అదిరిపోతుందట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో రీఎంట్రీ ఇస్తూ వరుసబెట్టి సినిమాలను చేస్తున్నాడు.ఇప్పటికే వకీల్ సాబ్ చిత్ర షూటింగ్‌ను చివరి దశకు తీసుకొచ్చిన పవన్, తన నెక్ట్స్ మూవీలను కూడా లైన్‌లో పెడుతున్నాడు.

 Ram Charan, Pawan Kalyan, Krish, Viroopaksha-TeluguStop.com

ఈ క్రమంలో దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ఓ పీరియాడికల్ మూవీలో పవన్ నటించనున్నాడు.

ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇందులో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నటిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమాలో చరణ్ ఓ కేమియో పాత్రలో నటించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ కేమియో పాత్ర ఉందని, అందులో ఎవరిని నటింపజేయాలా అని తీవ్రంగా ఆలోచించి చివరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితేనే పర్ఫెక్ట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారు.

దీంతో చరణ్‌ను ఈ సినిమాలో నటించాల్సిందిగా కోరగా ఆయన వెంటనే ఓకే చెప్పాడట.

ఇక ఈ సినిమాలో పవన్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా పూజితా పొన్నాడ కూడా నటిస్తుందట.మరి ఈ సినిమాలో చరణ్ కేమియో ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube