నీ బుర్రే బుర్ర జక్కన్న, నీ మాయకు హ్యాట్సాఫ్‌  

Ram Charan Birthday Rrr Ntr Voice - Telugu Bheem For Ramaraju, Ntr Voice, Rajamouli Released Ram Charan Rrr Look, Ram Charan, Rrr

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఏం చేసినా కూడా చాలా డెప్త్‌గా ఆలోచించి చేస్తాడనే విషయం మరోసారి నిరూపితం అయ్యింది.ఆయన స్టార్‌ హీరోల మల్టీస్టారర్‌ చేయబోతున్నాడు అన్నప్పుడు ఇద్దర హీరోల ఫ్యాన్స్‌ను ఆయన మాత్రమే సంతృప్తి పర్చగలరు, మరే దర్శకుడు అయినా కూడా ఫ్యాన్స్‌ తన్నుకు చస్తారు, అలాగే ఫ్యాన్స్‌ మద్య దర్శకుడు కూడా నలిగి పోతాడని అంతా అనుకున్నారు.

 Ram Charan Birthday Rrr Ntr Voice

మొన్న ఉగాది కానుకగా వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ లోగో విషయంలో ఫ్యాన్స్‌ మద్య కాస్త చర్చ జరిగిన విషయం తెల్సిందే.
ఆ వివాదం పెద్దది కాకుండానే రామరాజు బర్త్‌డే వీడియోను జక్కన్న విడుదల చేశాడు.

మొదటి నుండి కూడా చరణ్‌ బర్త్‌డేకు ఎన్టీఆర్‌ గిఫ్ట్‌ అంటూ ప్రచారం చేయడం జరిగింది.దాంతో అంతా కూడా చరణ్‌ బర్త్‌డేకు ఎన్టీఆర్‌ నటిస్తున్న భీమ్‌ పాత్రకు సంబంధించిన వీడియో వస్తుందేమో అని అంతా అనుకున్నారు.

నీ బుర్రే బుర్ర జక్కన్న, నీ మాయకు హ్యాట్సాఫ్‌-Latest News-Telugu Tollywood Photo Image

కాని అనూహ్యంగా చరణ్‌ వీడియోను ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో తీసుకు వచ్చాడు.ఈ వీడియోలో ఇద్దరిని చూపించడంతో మెగా నందమూరి ఫ్యాన్స్‌ను సంతృప్తి పర్చాడు.

విజువల్‌ పరంగా చరణ్‌ అభిమానులను సంతృప్తి పర్చిన జక్కన్న ఇక వాయిస్‌ ఓవర్‌ను ఎన్టీఆర్‌తో ఇప్పించడం ఆ వాయిస్‌ చాలా పవర్‌ ఫుల్‌గా ఉండటం వల్ల నందమూరి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేశారు.మొత్తానికి మెగా మరియు నందమూరి అభిమానులను ఒకే వీడియోతో సంతృప్తి పర్చడంతో జక్కన్న పై ప్రశంసలు కురుస్తున్నాయి.నిజంగా జక్కన్న నీ బుర్రే బుర్ర బాబు అంటూ హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.ఈ వీడియోనే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Charan Birthday Rrr Ntr Voice Related Telugu News,Photos/Pics,Images..