ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి.. తుక్కు రేగ్గొట్టిన రామరాజు!  

Ram Charan Birtdhay Surprise Gift Bheem For Ramaraju Video Released - Telugu Bheem For Ramaraju, Ntr, Rajamouli, Ram Charan, Rrr, Telugu Movie News

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్‌ నుంచి బర్త్‌డే గిఫ్ట్ వచ్చేసింది.దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 Ram Charan Birtdhay Surprise Gift Bheem For Ramaraju Video Released

కాగా ఉగాది సందర్భంగా ఈ చిత్రం టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ ఎలాంటి రెస్పాన్స్‌ను క్రియేట్ చేశాయో తెలిసిందే.

కాగా చరణ్ పుట్టినరోజున ఎన్టీఆర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.

ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి.. తుక్కు రేగ్గొట్టిన రామరాజు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో చరణ్ నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు.ఇందులో చరణ్ ఎలివేషన్ పీక్స్‌లో చూపించారు చిత్ర యూనిట్.

అల్లూరి సీతారామరాజు గురించి తారక్ బ్యాక్‌గ్రౌండ్‌లో చెప్పే డైలాగ్‌కు గూస్‌బంప్స్ రావడం ఖాయం.ముఖ్యంగా ‘ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదారి’ అనే డైలాగుకు ఫ్యాన్స్ చొక్కాలు చించుకోవడం ఖాయం.

ఇక ఈ వీడియోతో చరణ్‌కు నిజమైన బ్యాంగ్ ఇచ్చాడు తారక్.తన అన్న అల్లూరి సీతారామారాజు అంటూ తారక్ చెప్పే డైలాగుకు ఫ్యాన్స్‌కు పిచ్చ కిక్క్ ఎక్కింది.

మొత్తానికి తారక్ అన్నట్లుగానే ఈ గిఫ్ట్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని అంటున్నారు మెగా ఫ్యాన్స్.ఇక తారక్ ఇంట్రో ఎప్పుడు ఉంటుందా, అది ఎలా ఉంటుందా అనే అంచనాలు పీక్స్‌కు చేరాయి.