ఉపాసన బలవంతం.. వస్తానంటున్న చరణ్‌       2018-05-12   01:22:01  IST  Raghu V

ఈ మద్య కాలంలో రామ్‌ చరణ్‌ మరియు ఉపాసనలు సోషల్‌ మీడియాలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఉపాసన ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాల్లో తమకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని పోస్ట్‌ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. రామ్‌ చరణ్‌కు సోషల్‌ మీడియా అకౌంట్స్‌ లేకపోవడంతో ఆయనకు సంబంధించిన పబ్లిసిటీ కార్యక్రమాలు అన్ని కూడా ఉపాసన చూసుకుంటుంది. గతంలో రామ్‌ చరణ్‌ ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. కాని ఆమద్య కొన్ని కారణాల వల్ల ట్విట్టర్‌ను వదిలేశాడు. అప్పుడప్పుడు ఫేస్‌బుక్‌లో చరణ్‌ కనిపిస్తూ ఉన్నాడు.

ప్రస్తుతం సెలబ్రెటీలు ఎక్కువగా ట్విట్టర్‌ మరియు ఇన్‌స్టాల్లో సందడి చేస్తున్నారు. అందుకే రామ్‌ చరణ్‌ను కూడా మళ్లీ సోషల్‌ మీడియాలోకి రావాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. ఎవరెన్ని చెప్పినా, ఎవరెంతగా విజ్ఞప్తి చేసినా కూడా చరణ్‌ మాత్రం సోషల్‌ మీడియాలోకి వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. అయితే తాజాగా ఆయన ఆలోచనలో మార్పు వచ్చినట్లుగా అనిపిస్తుంది. తాను మళ్లీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం సరైన సమయంకై ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. చరణ్‌ ఈ నిర్ణయం వెనుక ఉపాసన బలవంతం ఉన్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా ఒక మీడియా సంస్థతో రామ్‌ చరణ్‌ మాట్లాడటం జరిగింది. ఆ సమయంలోనే ఇటీవల సోషల్‌ మీడియా ప్రభావంపై చరణ్‌ మాట్లాడాడు. తనకు సంబంధించిన పోస్ట్‌లను ఉపాసన ఎక్కువగా పోస్ట్‌ చేస్తున్న కారణంగా తాను ఆమె ఫోన్‌లో అభిమానులు పెట్టే పోస్ట్‌లు చెక్‌ చేస్తున్నాను అని, ఆమె ఫోన్‌లో అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో జరుగుతున్న విషయాను తెలుసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తాను ట్విట్టర్‌ మరియు ఇన్‌స్టాలో అకౌంట్స్‌ ఓపెన్‌ చేయాలి అనేది చాలా రోజులుగా ఉపాసన కోరుతున్నది. అందుకే తాను మళ్లీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాను అంటూ చరణ్‌ పేర్కొన్నాడు.

సరైన సమయంలో, సరైన విషయంతో మళ్లీ ట్విట్టర్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తాను అంంటూ చరణ్‌ చెప్పుకొచ్చాడు. ఆ సరైన సమయం ఎప్పుడు అనేది ఆయన చెప్పలేదు. ఇక ప్రస్తుతం రామ్‌ చరణ్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాలున్న ఆ సినిమా దసరాకు విడుదల చేయానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రంగస్థలం చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్న రామ్‌ చరణ్‌ తదుపరి చిత్రంతో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాను అనే నమ్మకంతో ఉన్నాడు.