పూజ పాప కోసం రామ్ చరణ్ ఏకంగా నక్సలైట్ గా...

తెలుగులో ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ “ఆచార్య” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా టాలీవుడ్ బ్యూటిఫుల్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

 Ram Charan Became Naxalite For Pooja Hegde In Acharya Movie-TeluguStop.com

కాగా ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ అప్పీయరెన్స్ పాత్రలో కనిపించనున్నాడు.దీంతో రామ్ చరణ్ కి జోడీగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.

అయితే వీరిద్దరి నిడివి ఈ చిత్రంలో తక్కువగా ఉన్నప్పటికీ పూజా హెగ్డే మాత్రం దాదాపుగా కోటి రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

 Ram Charan Became Naxalite For Pooja Hegde In Acharya Movie-పూజ పాప కోసం రామ్ చరణ్ ఏకంగా నక్సలైట్ గా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఈ చిత్రంలో పూజా హెగ్డే రామ్ చరణ్ కి జోడిగా నటిస్తున్న పూజా హెగ్డే పాత్ర చాలా ఎమోషనల్ సన్నివేశాలతో కూడుకొని ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు.అయితే  వీరిద్దరి సన్నివేశాల నిడివి దాదాపు 30 నిమిషాల పాటు ఈ చిత్రంలో ఉన్నట్లు సమాచారం.

అంతేకాకుండా ఈ చిత్రంలో అనుకోకుండా పూజా హెగ్డే మరణించడంతో రామ్ చరణ్ ఆమె కోసం నక్సలైట్ గా మారతాడని కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.ఏదేమైనప్పటికీ తండ్రీకొడుకులు ఈ చిత్రంలో తమ పర్ఫార్మెన్స్ తో మరోసారి బాక్సాఫీస్ కి చెమటలు పట్టించనున్నారని  చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన “లాహి  లాహి”  అనే సాంగ్ విడుదల కాగా మంచి స్పందన లభించింది.అంతేకాకుండా ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ వీడియోల సరసన నిలుస్తోంది.
  అయితే ఖైదీ నెంబర్ 150 చిత్రం ద్వారా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన మెగాస్టార్ చిరంజీవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోతున్నాడు.ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “సైరా నరసింహా రెడ్డి” చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ఆచార్య చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా శ్రమిస్తున్నాడు.అలాగే ఇటీవల మలయాళంలో మంచి విజయం సాధించిన “లూసిఫర్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి సన్నాహాలు చేస్తున్నాడు.

#AcharyaShooting #AcharyaMovie #RamCharan #Ram Charan #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు