మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.
కాగా నేడు (మార్చి 27న) 35వ పుట్టినరోజు జరుపుకుంటున్న చరణ్‌కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా ప్రతియేటా చరణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుగుతుండగా, ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ కారణంగా చరణ్ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేశాడు.
కాగా తనపట్ల ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని చరణ్ చెప్పుకొచ్చాడు.తనకు ఫ్యాన్స్ ఒక బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలని చరణ్ కోరాడు.
ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా ఎవరూ కూడా బయటకు రాకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ఆయన కోరాడు.
ఇక చరణ్ బర్త్‌డేను పురస్కరించుకుని తారక్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్‌ను రెడీ చేశాడు.
అయితే కొన్ని కారణాల వల్ల అది డిలే అయ్యిందని తారక్ చెప్పుకొచ్చాడు.