''ఆచార్య 'సిద్ధ'మవుతున్నాడు'' అంటూ కొరటాల ఇచ్చిన హింట్ ఏంటీ?

మెగా స్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా స్థాయిని రెట్టింపు చేసేందుకు గాను సినిమా లో చరణ్‌ ను నటింపజేస్తున్న విషయం తెల్సిందే.

 Ram Charan As Sidda In Chiranjeevi Acharay Look Coming Very Soon-TeluguStop.com

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన షూటింగ్‌ గోదావరి జిల్లాల్లో చేస్తున్నారు.ఈ షెడ్యూల్‌ పూర్తి అయిన తర్వాత హైదరాబాద్ లో తదుపరి షెడ్యూల్‌ ఉంటుంది.

దాంతో సినిమా షూటింగ్‌ పూర్తి అవుతుంది.చిరంజీవి ఆచార్య సినిమా లో చరణ్‌ సిద్ద పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే హిట్‌ ఇచ్చారు.

 Ram Charan As Sidda In Chiranjeevi Acharay Look Coming Very Soon-ఆచార్య సిద్ధ’మవుతున్నాడు అంటూ కొరటాల ఇచ్చిన హింట్ ఏంటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నేడు కొరటాల శివ మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు ఆచార్య సిద్దం అవుతున్నాడు అంటూ చరణ్‌ బ్యాక్‌ సైడ్‌ నుండి ఉన్న పొటోను షేర్‌ చేయడం జరిగింది.దాంతో కొరటాల శివ ఉన్నట్లుండి షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమై ఉంటుందా అంటూ అంతా కూడా జుట్టు పీక్కుంటూ ఆలోచిస్తున్నారు.

మాకు అందిన సమాచారం ప్రకారం శివ రాత్రి సందర్బంగా ఆచార్య సినిమా లోని సిద్ద పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ ను రివీల్‌ చేసే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ విషయాన్ని మెల్లగా రివీల్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది.శివ రాత్రికి చరణ్‌ పాత్ర కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ ను విడుదల చేయడం తో పాటు చిరు మరియు చరణ్ ల కలయికలో కూడా చిన్న టీజర్‌ ను విడుదల చేస్తారేమో అంటూ అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

మొత్తానికి ఆచార్య నుండి ఏదో ప్రత్యేకమైన సర్‌ ప్రైజ్ మాత్రం రాబోతుందని కొరటాల శివ ట్వీట్‌ తో క్లారిటీ వచ్చేసింది.ఈ నెలలో చరణ్‌ బర్త్‌ డే కూడా ఉంది.

కనుక ఆ సమయంలో కూడా ప్రత్యేకమైన గిప్ట్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.మే 13న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

#Chiranjeevi #Sidda Look #Ram Charan #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు