మెగా అభిమాని కుటుంబానికి చరణ్ సాయం  

Ram Charan Announce 10 Lakhs For Noor Family-mega Family,mega Fans,noor Mohammad,ram Charan,telugu Movie News

మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు ఎంతమంది ఉన్నా కొందరు మాత్రం తమ ప్రత్యేకతను చాటుకున్నారు.వారిలో ముందుండే వ్యక్తి నూర్ మహ్మద్.మెగా ఫ్యాన్‌గా నూర్ చేసిన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి.చిరంజీవిపై అభిమానంతో ఆయన చెప్పిన విధంగా సామాజిక పనుల్లో నూర్ ముందుండేవారు.

Ram Charan Announce 10 Lakhs For Noor Family-mega Family,mega Fans,noor Mohammad,ram Charan,telugu Movie News Telugu Viral News Ram Charan Announce 10 Lakhs For Noor Family-mega Family Mega Fans Noor -Ram Charan Announce 10 Lakhs For Noor Family-Mega Family Mega Fans Noor Mohammad Ram Telugu Movie News

అయితే ఇటీవల ఆయన మృతిచెందడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

అభిమానులతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా నూర్ మృతదేహానికి నివాళి అర్పించాడు.

అంతలా మెగాఫ్యాన్స్‌లో గుర్తింపు సాధించిన నూర్ మరణం తమకు తీరని లోటని మెగా ఫ్యామిలీ అంటోంది.ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నూర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా మెగాఫ్యామిలీ ఎప్పుడూ ఉంటుందని చెప్పాడు.

నూర్ కుటుంబానికి తనవంతు సాయంగా రూ.10 లక్షలు అందజేయనున్నట్లు చరణ్ చెప్పుకొచ్చాడు.

మెగాఫ్యాన్‌గా నూర్ చేసిన పలు సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా చరణ్ గుర్తుకు చేసుకున్నాడు.అటు నూర్ మహ్మద్ మృతిపై మిగతా మెగా హీరోలు కూడా తమ సంతాపం తెలిపారు.

నూర్ కుటుంబానికి తాము కూడా అండగా ఉంటామంటున్నారు మెగా ఫ్యాన్స్.

తాజా వార్తలు