వెంకీతో రామ్ చరణ్ సినిమా... దసరాకి కీలక ప్రకటన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాపై ఉన్నాడు.కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

 Ram Charan And Venky Movie Will Be Announced In Dasara, Ram Charan, Venky Kudumu-TeluguStop.com

పరిస్థితుల బట్టి సినిమా షెడ్యూల్ ఖరారు చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.రీసెంట్ గా ఆయన కూడా కరోనా బారిన పడటంతో షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి అవాంతరాలు రాకుండా జరిగే విధంగా షూటింగ్ ప్లానింగ్ చేస్తున్నారు.

భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్ఠీఆర్ కొమరామ్ భీం పాత్ర చేస్తూ ఉండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు.ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.

దీనికి సంబందించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది.

ఇక రామ్ చరణ్ మాత్రం చాలా మంది దర్శకులు చెప్పిన కథలు విన్నాడు.

అయితే వీరిలో యంగ్ క్రేజీ దర్శకుడు వెంకీ కుడుములు చెప్పిన కథకి ఒకే చెప్పాడని టాక్ నడుస్తుంది.రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లతో వరుసగా రెండు హిట్స్ కొట్టిన వెంకీ రామ్ చరణ్ కోసం కూడా అలాంటి ఇంటరెస్టింగ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కథని సిద్ధం చేసి వినిపించాడని టాక్.

ఇప్పటి వరకు కెరియర్ లో ఎక్కువగా మాస్ ఎలిమెంట్స్ ఉన్న పాత్రలో చేసిన రామ్ చరణ్ కి వెంకీ చెప్పిన కథ కొత్తగా అనిపించడంతో ఒకే చెప్పాడని సమాచారం.ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన వర్క్ స్టార్ట్ చేయించాడని, దీనికి సంబందించిన అఫీషియల్ ప్రకటన దసరాకి చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

అలాగే ఈ ఏడాది ఆఖరులో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టాక్.మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మించే అవకాశం ఉందని తెలుస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube