చరణ్‌ అభిమానులను కన్ఫ్యూజన్‌ లోకి నెట్టేసిన శంకర్‌.. ఇదిగో క్లారిటీ

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా ప్రస్తుతం ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ జరుగుతున్న విషయం తెల్సిందే.ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే శంకర్‌ దర్శకత్వంలో చరణ్ సినిమా ను మొదలు పెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

 Ram Charan And Shankar Movie Update From Mega Fans-TeluguStop.com

ప్రస్తుతం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తో శంకర్‌ చర్చలు జరుపుతున్నాడు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా శంకర్‌ కొత్త సినిమా ప్రకటించాడు.అపరిచితుడు సినిమా ను హిందీలో రీమేక్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో అసలు తెలుగు సినిమా ను శంకర్‌ కు చేసే ఉద్దేశ్యం ఉందా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

శంకర్ సినిమా లో చరణ్‌ చూసే భాగ్యం మనకు ఉందా లేదా అంటూ పలు రకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఈ సమయంలోనే చరణ్‌ అభిమానులు మరియు తెలుగు సినీ ప్రేమికులకు ఉన్న అనుమానాలు అన్నింటిని కూడా మెగా ఫ్యామిలీ సన్నిహితులు క్లారిటీ చేశారు.

 Ram Charan And Shankar Movie Update From Mega Fans-చరణ్‌ అభిమానులను కన్ఫ్యూజన్‌ లోకి నెట్టేసిన శంకర్‌.. ఇదిగో క్లారిటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చరణ్‌ తో సినిమాను జులై లేదా ఆగస్టులో శంకర్‌ సినిమాను పట్టాలెక్కిస్తాడు.శంకర్‌ తన ప్రతి సినిమాకు ఏళ్లకు ఏళ్లు తీసుకుంటాడు.కాని ఈ సినిమా కు మాత్రం మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా సింపుల్‌ గా తక్కువ సమయంలోనే అంటే ఏడాదిలోనే పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.దిల్‌ రాజు అండ్‌ టీమ్‌ నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను వచ్చే ఏడాది దసరా వరకు విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఇక శంకర్‌ అపరిచితుడు సినిమా రీమేక్‌ ను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభించబోతున్నట్లుగా క్లారిటీ గా చెప్పాడు.దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటీ అంటే చరణ్‌ మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్థంకు ముందే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

తద్వారా బాలీవుడ్‌ సినిమాను వెంటనే పట్టాలెక్కించే అవకాశం ఉందని అంటున్నారు.మొత్తానికి చరణ్‌ మరియు శంకర్‌ ల కాంబో మూవీ పై కన్ఫ్యూజన్‌ లేకుండా క్లారిటీ ఇదన్నమాట.

#Ram Charan #Dil Raju #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు