చరణ్‌ 'మగధీర'ను మించి ఆ సినిమా ఉంటుందట

రామ్ చరణ్ కెరీర్‌ లో బిగ్గెస్ట్ మూవీ ఏది అంటే ఎవరైనా ఠక్కున చెప్పే సినిమా పేరు మగధీర అనే చెప్తారు.ఆ సినిమా ను మించిన వసూళ్లతో పలు సినిమాలు వచ్చినా కూడా చరణ్‌ మూవీ బెస్ట్‌ జాబితాలో మగధీర ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు.

 Ram Charan And Shankar Movie Update From Dil Raju, Dil Raju, Magadheera, Ram Cha-TeluguStop.com

వసూళ్లతో పాటు అన్ని విధాలుగా ఆ సినిమా చరణ్‌ కు ఎప్పటికి గుర్తుండి పోయేలా ఉంటుంది.గతంలో పలు సందర్బాల్లో రామ్‌ చరణ్‌ స్వయంగా మగధీర సినిమా గురించి ఆ వ్యాఖ్యలను చేసిన విషయం తెల్సిందే.

ఇప్పుడు రామ్ చరణ్‌ చేయబోతున్న సినిమా విషయమై అంతకు మించి అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.పెద్ద ఎత్తున అంచనాలున్న ఆర్ఆర్‌ఆర్‌ సినిమా కంటే కూడా అధికంగా ఆయన నటించబోతున్న శంకర్‌ మూవీ పై అంచనాలు ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్‌ సినిమా లో ఎన్టీఆర్‌ కూడా ఉన్నాడు.కనుక ఆ సినిమా మొత్తం క్రెడిట్‌ ఎవరికి దక్కతుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

కాని శంకర్‌ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఖచ్చితంగా ఆయన కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుందనే నమ్మకంను ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

శంకర్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా ను దిల్‌ రాజు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

దిల్ రాజు కాంపౌండ్‌ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో చరణ్ ది బెస్ట్‌ అన్నట్లుగా కనిపించబోతున్నాడట.ఇప్పటి వరకు చరణ్ ఏ సినిమాలో కనిపించని విధంగా చరణ్‌ కనిపించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా అంటున్నారు.

ఇప్పటి వరకు చరణ్‌ బెస్ట్‌ సినిమా అంటే మగధీర అని చెప్పే వారు కాని ఖచ్చితంగా శంకర్‌ సినిమాను చెప్పబోతున్నారు అంటూ దిల్ రాజు వర్గీయులు అంటున్నారు.కనుక శంకర్ సినిమా కోసం మెగా అభిమానులు ఆశలు పెట్టుకుని ఉండవచ్చు అంటూ వారు అంటున్నారు.

ఇప్పటి వరకు చరణ్‌ నటించిన పాన్‌ ఇండియా సినిమాలను మించి ఈ సినిమా ఉంటుందని కూడా అంటున్నారు.అంటే ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా ను మించి ఉంటుంది అనేది వారి ఉద్దేశ్యం.

మరి జక్కన్న సినిమా ను డామినేట్ చేసే విధంగా శంకర్ సినిమా ఉంటుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube