ఆర్ఆర్‌ఆర్ అప్డేట్‌ : ఇద్దరు హీరోల టీజర్‌ కు ముహూర్తం ఫిక్స్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది.ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఈ సినిమా ను అక్టోబర్ లో విడుదల చేయడం దాదాపుగా కన్ఫర్మ్‌ అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

 Ram Charan And Ntr Rrr Teaser For Friendship Day Special , Rrr Teaser, Friendshi-TeluguStop.com

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ ను వచ్చే నెలలో పూర్తి చేయబోతున్నారు.ఇక ఈ సినిమా నుండి మేకింగ్‌ వీడియోను ఈనెల 15న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.

మరో వైపు ఈ సినిమా ఇద్దరు హీరోల టీజర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఇద్దరు హీరోల వేరు వేరు ప్రోమోలు వచ్చాయి.

కాని ఇద్దరు హీరోల టీజర్‌ లు కావాలంటూ చాలా రోజులుగా అభిమానులు కోరుకుంటున్నారు.ఎట్టకేలకు రాజమౌళి ఇద్దరు హీరోల టీజర్ కు డేట్‌ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

Telugu Friendship Day, Rajamouli, Ram Charan, Ramcharan, Rrr, Rrr Teaser, Rrrtea

ఆర్ ఆర్‌ ఆర్‌ లో హీరోలు ఇద్దరు స్నేహితులుగా కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి.కనుక ఇద్దరు హీరోల స్నేహంకు గుర్తుగా వచ్చే నెలలో స్నేహితుల దినోత్సవం సందర్బంగా కొత్త టీజర్ ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.కొత్త టీజర్ తో ప్రేక్షకులను సినిమాకు మరింతగా కట్టి పడేస్తారని.తద్వార సినిమాపై అంచనాలు పెంచుతారంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఆగస్టు 1వ తారీకున స్నేహితుల దినోత్సవం సందర్బంగా రాబోతున్న ప్రోమో ఖచ్చితంగా మరో లెవల్‌ లో ఉంటుందని.సినిమా పై అంచనాలను కేవలం తెలుగు ప్రేక్షకుల్లో మాత్రమే కాకుండా అన్ని భాషల వారిలో పెంచే విధంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

వెయ్యి కోట్ల కు పైగా బిజినెస్ చేసిన ఈ సినిమా హాలీవుడ్‌ సినిమాల రేంజ్ లో వసూళ్లను సాధిస్తుందని.ఇండియాస్ నెం.1 గా నిలుస్తుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube