మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఎన్టీఆర్‌, చరణ్‌ లు కలిసేది అప్పుడేనా?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా షూటింగ్‌ విషయమై గత కొన్ని రోజులుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మార్చిలో ఈ సినిమా కు గుమ్మడి కాయ కొట్ట బోతున్నట్లుగా ప్రచారం జరిగింది.

 Ram Charan And Ntr Rrr Movie Shooting Reschedule , Breaking News, Ntr, Rajamouli-TeluguStop.com

అక్టోబర్‌ లో సినిమాను విడుదల చేయబోతున్నారు.కనుక సినిమా ఖచ్చితంగా మార్చిలో ముగిసే అవకాశం ఉందని అనుకున్నారు.

కాని చరణ్‌ ఇప్పుడు ఆచార్య సినిమా షూటింగ్‌ కోసం పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నాడు.ఆయన మరో రెండు వారాల పాటు అక్కడే ఉండే అవకాశం ఉంది.

ఇక ఎన్టీఆర్‌ ఇటీవలే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో జెమిని టీవీ కోసం ఒక యాడ్‌ షూట్‌ లో పాల్గొన్నాడు.యాడ్‌ షూటింగ్‌ లో భాగంగా ఎన్టీఆర్‌ ఇటీవల తన లుక్ ను లైట్ గా మార్చాడు.

కనుక మళ్లీ ఆర్ ఆర్‌ ఆర్‌ కోసం లుక్‌ కావాలంటే కనీసం రెండు మూడు వారాలు అయినా పడుతుంది.

ఇద్దరు హీరోలు మళ్లీ ఆర్‌ ఆర్‌ ఆర్‌ షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వాలంటే కనీసం మూడు వారాలు అయినా పట్టే అవకాశం ఉందని అంటున్నారు.

మార్చి రెండవ లేదా మూడవ వారంలో ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభం అవుతుంది.చివరి షెడ్యూల్ ను మూడు నుండి నాలుగు వారాల పాటు కంటిన్యూగా చేసి పేకప్‌ చెప్పేయబోతున్నారట.

అంటే మార్చి లో అనుకున్నట్లుగా కాకుండా ఏప్రిల్‌ లో సినిమా షూటింగ్‌ ను పూర్తి చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.

ఇప్పటికే అజయ్‌ దేవగన్‌ మరియు ఆలియా భట్‌ లతో షూటింగ్‌ ను ముగించేసిన జక్కన్న ఇప్పుడు ఎన్టీఆర్‌ మరియు చరణ్‌ లతో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube