'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ : ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా..!

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Ram Charan And Ntr Movie Rrr Trailer Out Now Details,ntr, Rajamouli, Ram Charan,-TeluguStop.com

దేశ వ్యాప్తంగా ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తూ రాజమౌళి తన ప్లాన్ ను అమలుచేస్తున్నాడు.డిసెంబర్ 9న ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు ముందుగానే ప్రకటించారు మేకర్స్.

ఇక తాజాగా ఈ సినిమా నుండి అందరి అంచనాలను అందుకునే రేంజ్ లో ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ దూసుకు వచ్చింది.

ట్రైలర్ కంటే ముందే వరుస పోస్టర్స్ తో ప్రోమోలతో ఈ ట్రైలర్ మీద మరిన్ని అంచనాలను పెంచేసాడు జక్కన్న.

ఇప్పుడు విడుదల అయిన ట్రైలర్ చూస్తే ఇంత హైప్ ఎందుకు క్రియేట్ చేసాడో అర్ధం అవుతుంది.అందరు పెట్టుకున్న అంచనాల కంటే వందరెట్లు అధికంగానే ఈ ట్రైలర్ ఉందని చెప్పాలి.

రామ్ చరణ్, ఎన్టీఆర్ విషయం అయితే ఇక చెప్పాల్సిన పని లేదు.

ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్, చరణ్ స్పెషల్ గా కనిపించారు.

ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ఈక్వల్ గా చూపించాడు రాజమౌళి. డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.

ముఖ్యంగా చివరిలో వచ్చే డైలాగ్ అందరి దృష్టిని ఆకట్టుకుందని చెప్పాలి. ”యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి” అంటూ వచ్చే డైలాగ్, ఈ నక్కల వేట ఎంతసేపు.

కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా.అనే డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి.

ఈ ట్రైలర్ ను థియేటర్స్ ద్వారా విడుదల చేసారు మేకర్స్.యూట్యూబ్ లో ఈ రోజు సాయంత్రం విడుదల చేస్తామని ప్రకటించినా.ముందుగానే విడుదల చేసారు.దీంతో ట్రైలర్ కోసం వేచిచూసే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సినిమా విడుదల కంటే ముందుగానే ఆర్ ఆర్ ఆర్ సంబరాలు స్టార్ట్ చేసారు అభిమానులు.

థియేటర్స్ దగ్గర ఎన్టీఆర్, చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచాలు కాలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇప్పుడే ఇలా ఉంటే సినిమా థియేటర్స్ లో వచ్చిన తర్వాత సీన్ ఎలా ఉంటుందో ఊహకు కూడా అందడం లేదు.ఈ ట్రైలర్ ను అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ సందడి సందడి చేస్తున్నారు.

మీరు ఇంత వరకు ట్రైలర్ చూడకపోతే ఇప్పుడు ఒక లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube