నాటు నాటు స్టెప్పులతో అదరగొట్టిన చరణ్, కీర్తి!

కీర్తి సురేష్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.ఆమెకు తెలుగు, తమిళ్ భాషల్లో మంచి మార్కెట్ ఉంది.

 Ram Charan And Keerthy Suresh Dance On Naatu Naatu At Pre-release Event Of Good Luck Sakhi, Naatu Naatu Song, Keerthy Suresh, Good Luck Sakhi , Tollywood, Adi Penisetty , Jagapathi Babu, Ram Charan,-TeluguStop.com

మహానటి సినిమా తర్వాత ఈమె స్టార్ హీరోయిన్ గా మారిపోవడమే కాకుండా ఈమె క్రేజ్ కూడా అమాంతంగా పెరిగింది.ఒకే ఒక్క సినిమాతో నేషనల్ అవార్డు సైతం అందుకుని తన టాలెంట్ నిరూపించుకుంది.

కీర్తి సురేష్ ప్రస్తుతం ‘గుడ్ లక్ సఖి’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది.

 Ram Charan And Keerthy Suresh Dance On Naatu Naatu At Pre-release Event Of Good Luck Sakhi, Naatu Naatu Song, Keerthy Suresh, Good Luck Sakhi , Tollywood, Adi Penisetty , Jagapathi Babu, Ram Charan, -నాటు నాటు స్టెప్పులతో అదరగొట్టిన చరణ్, కీర్తి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రామ్ చరణ్ తేజ్ వచ్చారు.

ఈ వేదికపై కీర్తి సురేష్ మాట్లాడుతూ.మహానటి తర్వాత నేను సైన్ చేసిన సినిమా ఇది.ఒక సీరియస్ సినిమా చేసిన తర్వాత ఒక ఫన్ సినిమా చేయాలనీ అనిపించింది.

Telugu Adi Penisetty, Luck Sakhi, Jagapathi Babu, Keerthy Suresh, Naatu Naatu, Ram Charan, Ramcharan, Tollywood-Movie

అలంటి సమయంలోనే ఈ కథ నా దగ్గరికి వచ్చింది.కథ వినగానే ఓకే చెప్పేసాను.చరణ్ ను ఉద్దేశించి ” మీరు గెస్ట్ గా రావడం చాలా ఆనందంగా ఉంది.

మీరు ఒక్క R తో రంగస్థలాన్ని ఒక ఊపు ఊపారు.మరి RRR ను ఎప్పుడు చూపిస్తున్నారు.?ఈ సినిమా కోసం వెయిటింగ్.అని ఆ తర్వాత నాటు నాటు స్టెప్ నాతో చేయాలి.

అది నా డ్రీమ్ అంటూ కీర్తి చరణ్ ను కోరింది.

చరణ్ కూడా అందుకు ఒప్పుకోవడంతో చరణ్ తో కలిసి ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులు వేసి వేదికను సందడిగా మార్చారు.

అలాగే కీర్తి తన కోరికను కూడా తీర్చుకుంది.ఇంకా కార్తీ చిరంజీవి రానందుకు చాలా మిస్సవుతున్నాను అని ఆమె తెలిపింది.

చివరిగా ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేస్తున్నాం.మీరు తప్పకుండ చూడాలి అని తెలిపింది కీర్తి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube