'ఆచార్య' స్టోరీ గాసిప్స్ః సిద్ద పాత్ర చనిపోతుందా?

మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా లో చరణ్ నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా నుండి చరణ్‌ లుక్‌ ను ఆయన బర్త్‌ డే సందర్బంగా విడుదల చేశారు.

 Ram Charan And Chiranjeevi Acharya Movie Story , Acharya, Chiranjeevi ,ram Chara-TeluguStop.com

ఈ సినిమాలో చరణ్ పాత్ర గురించి మొదటి నుండి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.మరోసారి ఈ సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఒక కథ తెగ ఆసక్తికరంగా మారింది.ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.

రామ్‌ చరణ్‌ మరియు చిరంజీవిలు నక్సలైట్లుగా ఉద్యమంలో ఉంటారు.వీరిద్దరు కలిసి చాలా పోరాటాలు చేస్తారు.

ఆ పోరాటాల్లో సిద్ద చనిపోవడంతో ఆచార్య ఉద్యమం నుండి బయటకు వచ్చి జన జీవన స్రవంతిలో కలిసి పోతాడు.అలా ఇద్దరి కథ ముగుస్తుంది.

రామ్‌ చరణ్‌ మరియు చిరంజీవిలు కలిసి పోరాటం చేసే సన్నివేశాలు సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటాయని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.రామ్‌ చరణ్‌ మరియు చిరంజీవిలు అలా గన్ పట్టుకుని సాగుతున్న షాట్స్ అద్బతంగా ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మెగా ఫ్యాన్స్ అయితే సినిమా ఆహా ఓహో అన్నట్లుగా ఉంటుందని అంటున్నారు.కాని స్టోరీ విషయానికి వస్తే చాలా సింపుల్ గా ఉండటం వల్ల అభిమానులు కాస్త నిరుత్సాహంగా అనిపిస్తుంది.

కాని సినిమా కథ అన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది కేవలం పుకార్లే అంటూ కొందరు మెగా ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.మే నెలలో రాబోతున్న ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌ కొట్టడం ఖాయం అన్నట్లుగా మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 ఈ చిత్రంలో చిరంజీవికి జోడీ గా కాజల్‌ చరణ్‌ కు జోడీగా పూజా నటిస్తున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube