ఆచార్య ను అక్కడ విడుదల చేసే ఆసక్తి లేదా? రూ.20 కోట్లు వదిలేస్తారా?

మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా ను ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా ట్రైలర్‌ ను ఈనెల 12వ తారీకున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ఈ సినిమా కు పాన్ ఇండియా స్థాయి లో మంచి డిమాండ్ ఉంది. ఆర్ ఆర్‌ ఆర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ఈ సినిమా లో కీలక పాత్రలో నటించడం వల్ల ఆచార్య సినిమా కు అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేయాలని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు.

కాని ఆచార్య మేకర్స్ తీరును చూస్తుంటే సినిమా ను హిందీ లో విడుదల చేసే అవకాశం కనిపించడం లేదు.హిందీ లో ఈ సినిమా కు రీమేక్ చేస్తారేమో అంటూ కొందరి లో చర్చ జరుగుతోంది.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో భారీ గా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.కాని ఈ సినిమా ను హిందీ లో డబ్బింగ్‌ చేయక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ముఖ్యంగా ఈ సినిమా లోని రామ్‌ చరణ్ కోసం అయినా ఆచార్య ను అక్కడ విడుదల చేస్తే బాగుండేది అనేది చాలా మంది అభిప్రాయం.అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను నిర్వహించబోతున్నారు.

సినిమా ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది.అప్పటి నుండి ఇప్పటి వరకు అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి.

కరోనా వల్ల సినిమా ను చాలా ఆలస్యం చేశారు.ఈ సినిమా లో కీలక పాత్ర లో సోనూ సూద్‌ నటించిన విషయం తెల్సిందే.

చిరంజీవి మరియు చరణ్ లు నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌ లో కనిపించబోతున్నారు.చిరంజీవికి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటించగా.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

చరణ్‌ కు జోడీగా పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే.మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా పై అంచనాలు భారీ గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు