లీకైన లుక్స్, సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న రామ్,అలియా  

Ram Charan And Alia Bhatt Looks Leaked From Rrr Movie - Telugu Ajay Devagan, Alia Bhatt, Rajamouli And Alia Bhatta, Rajamouli Rrr Latest Update, Ram Charan And Alia Bhatt, , Ramcharan And Ntr, Rrr

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ లు మొట్టమెదటి సారిగా చేస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్.ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం,దానికి తోడు స్టార్ హీరో లు ఈ చిత్రంలో నటిస్తుండడం తో ప్రేక్షకుల్లో చిత్రం పై భారీ గా అంచనాలు ప్రారంభం అయ్యాయి.

Ram Charan And Alia Bhatt Looks Leaked From Rrr Movie - Telugu Ajay Devagan, Alia Bhatt, Rajamouli And Alia Bhatta, Rajamouli Rrr Latest Update, Ram Charan And Alia Bhatt, , Ramcharan And Ntr, Rrr-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఎప్పుడెప్పుడు ఈ చిత్రం షూటింగ్ ను ముగించుకొని ఎప్పుడు థియేటర్స్ కు వస్తుందా అని ప్రతి ఒక్కరూ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే చాలా జాగ్రత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, తాజాగా ఈ చిత్రం లో అల్లూరి రామ రాజు పాత్ర లో చేస్తున్న రామ్ చరణ్,అలానే రామ రాజు ప్రేయసి అయిన సీతామహాలక్ష్మీ పాత్రలో నటిస్తున్న అలియా భట్ కు సంబందించిన కొన్ని ఫోటోలు లీక్ అయినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి.

అందులో బ్రిటీష్ సైనికాధికారిగా కనిపిస్తుండగా, అలియా భట్ పాతకాలం నాటి పద్దతిలో చీర కట్టుకొని కొత్త లుక్‌లో దర్శనమిచ్చింది.అయితే మరో విశేషం ఏమిటంటే ఈ ఫొటోలు కూడా అప్పటిలోలా బ్లాక్‌ అండ్ వైట్‌లో ఉన్నాయి.వాటిపై రాజమౌళి ముద్ర కూడా ఉంది.

అయితే ఇవి నిజంగా సినిమాలో నుంచి లీక్ ఆయిన ఫోటో లా లేదంటే ఫ్యాన్స్ ఇలా మార్ఫింగ్ చేసారా అన్న విషయం మాత్రం అర్ధం కావడం లేదు.ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తుండగా, రామ్ చరణ్ రామ రాజు పాత్రలో నటిస్తున్నారు.

అలానే అజయ్ దేవగన్, ఒలివియా మారిస్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.

డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.అయితే భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8 న విడుదల కానున్నట్లు తెలుస్తుంది.

మరి ఈ ఫోటోలు సినిమా నుంచా లేదంటే మార్ఫింగా అని తెలియాలి అంటే అప్పటివరకు ఆగాల్సిందే అన్నమాట.

తాజా వార్తలు