అల్లూరి సీతారామరాజు బాక్సింగ్‌ చేయడం ఏంటి గురూ?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా మరో అద్బుత ప్రపంచంలోకి తీసుకు వెళ్తాడు అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే.ఈగ చేసినా బాహుబలి అయినా కూడా అదో అద్బుతం అంటారు.

 Latest Update Of Ram Charan Doing Boxing In Rrr Movie, Ram Charan, Alluri Sithar-TeluguStop.com

ముఖ్యంగా బాహుబలి సినిమా చూస్తున్న ప్రేక్షకులను మహిష్మతి రాజ్యంలోకి తీసుకు వెళ్లి కూర్చోబెట్టాడు.ఏ విషయంలో అయినా అత్యంత జాగ్రత్తలు తీసుకుని ప్రేక్షకులను రంజింప చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

Telugu Cr Rrr, Bheem Ramcharan, Rajamouli, Ram Charan, Ramcharan-Movie

ప్రస్తుతం జక్కన్న దాదాపుగా 400 కోట్లతో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా కథాంశం ఏంటీ అనే విషయంపై ముందే క్లారిటీ ఇచ్చాడు.ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ పాత్రలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.అయితే అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన వీడియోను చరణ్‌ బర్త్‌డే సందర్బంగా నిన్న విడుదల చేశారు.

ఈ వీడియో ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

ఈ వీడియోలో రామ్‌ చరణ్‌ పోలీస్‌ గెటప్‌లో కనిపించడంతో పాటు బాక్సింగ్‌ చేస్తూ కూడా కనిపించాడు.

ఇది కేవలం ప్రమోషన్‌ కోసం మేకింగ్‌ వీడియోనా లేదంటే సినిమాలో కూడా చరణ్‌ బాక్సింగ్‌ చేస్తాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక అల్లూరి అంటూ పోలీస్‌ గెటప్‌లో చరణ్‌ను చూపించడం కూడా కొంత మేరకు చర్చనీయాంశం అయ్యింది.

ఇంతకు చరణ్‌ పాత్ర ఏంటీ పోలీస్‌గా ఎందుకు కనిపించాడు అనేది అందరిని ఆకర్షిస్తున్న విషయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube