అల్లు అరవింద్ రామాయణంకి రామ్ చరణ్ రాముడు... ఫిక్స్ అంటున్న ఫ్యాన్స్

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ లుక్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఈ పోస్టర్ బయటకొచ్చిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపొయింది.

 Ram Charan Alluri Sitarama Raju Look Rehearsal To Ramayana, Allu Aravind, Geeta-TeluguStop.com

అల్లూరి గెటప్ లో రామ్ చరణ్ అద్బుతంగా ఉన్నాడంటూ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.అదే సమయంలో రామ్ చరణ్ భార్య ఉపాసన, అలాగే మెగా బ్రదర్ నాగబాబు నుంచి కూడా ప్రశంసలు లభించాయి.

అల్లూరి గెటప్ లో రామ్ చరణ్ అచ్చం శ్రీరాముడులాగా ఉన్నాడని కితాబు ఇచ్చేశారు.వనవాసంలో ఉన్న శ్రీరాముడు రౌద్రంగా ఉంటే ఇలాంటి లుక్ లోనే కనిపిస్తాడని అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపధ్యంలో అల్లూ అరవింద్ రామాయణం మూవీ మళ్ళీ తెరపైకి వచ్చింది.

మధు మంతెన, అల్లూ అరవింద్ ఏకంగా 500 కోట్ల రూపాయిలతో రామాయణం సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించాలని ఆ మధ్య ప్లాన్ చేశారు.

త్రీడీలో ఈ సినిమాని ఆవిష్కరించాలని అనుకున్నారు.అయితే దర్శకుడు అప్పటికి ఫైనల్ కాలేదు.అయితే సినిమాని మాత్రం అఫీషియల్ గా ఎనౌన్స్ చేసేశారు.రామాయణం మూవీ ఉంటుందని చెప్పారు.

అయితే అప్పట్లో రామ్ చరణ్ ఈ సినిమాలో శ్రీరాముడుగా కనిపిస్తాడని టాక్ నడిచింది.తరువాత మహేష్ బాబు, ప్రభాస్ పేర్లు తెరపైకి వచ్చాయి.

అయితే ప్రస్తుతం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆది పురుష్ లో రాముడు పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు.ఈ నేపధ్యంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ పేరు కూడా వినిపించింది.

అయితే ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన అల్లూరి సీతారామరాజు లుక్ చూసిన తర్వాత రామాయణంలో రాముడు పాత్రకి రామ్ చరణ్ పెర్ఫెక్ట్ అంటూ చర్చ నడుస్తుంది.ఫ్యాన్స్ అయితే మరో అడుగు ముందుకి వేసి ఈ అల్లూరి గెటప్ రామాయణం సినిమాకి ఒక రిహార్సల్ అని ప్రచారం చేస్తున్నారు.

మరి ఈ లుక్ చూసిన తర్వాత అల్లు అరవింద్ కూడా రామ్ చరణ్ నే ఆ పాత్ర కోసం ఫైనల్ చేస్తారేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube