విధేయ రాముడు ఫ్లాప్‌ ఒప్పుకోవడానికి కారణం ఏంటో?  

రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పర్చిన విషయం తెల్సిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్‌ కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బోయపాటి కావాలని చరణ్‌ తో ఆ స్థాయిలో యాక్షన్‌ సీన్స్‌ చేయించాడు అంటూ ఆగ్రహంలో ఉన్నారు. ఇదే సమయంలో చరణ్‌ వినయ విదేయ రామ చిత్రం నిరాశ పర్చినందుకు క్షమించాలి అంటూ అభిమానులకు బహిరంగా లేఖ రాసి ఫ్లాప్‌ను ఒప్పుకున్నాడు. తాజాగా సినిమాకు సంబంధించిన కలెక్షన్స్‌ తీవ్రంగా నిరాశ పర్చడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Ram Charan About Vinaya Vidheya Rama Plop-Ram Trolls On Boyapati Srinu Movie

Ram Charan About Vinaya Vidheya Rama Plop

డిస్ట్రిబ్యూటర్‌లను సాంత్వన పర్చేందుకు రామ్‌ చరణ్‌ ఈ ప్రకటన చేసి ఉంటాడు అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రకటనలో రామ్‌ చరణ్‌ నిర్మాత దానయ్య ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు అంటూ చెప్పుకొచ్చాడు. కాని దర్శకుడు బోయపాటి విషయంలో మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. నిర్మాత దానయ్య చాలా కష్టపడ్డాడని, మేము ఈ చిత్రం సక్సెస్‌ కోసం ప్రయత్నించామంటూ చెప్పుకొచ్చాడు. కాని బోయపాటి దర్శకత్వం గురించి మాట్లాడలేదు. దాంతో చరణ్‌ కు కూడా బోయపాటిపై తీవ్ర స్థాయిలో కోపం ఉందని వెళ్లడయ్యింది.

Ram Charan About Vinaya Vidheya Rama Plop-Ram Trolls On Boyapati Srinu Movie

బోయపాటి శ్రీను గతంలో బాలయ్యతో రెండు సినిమాలు చేశాడు. బాలకృష్ణతో మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఆ కారణంగానే చరణ్‌ మూవీని కావాలని ఫ్లాప్‌ చేసినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే చరణ్‌ అభిమానులు పెద్ద ఎత్తున బోయపాటిపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి తదుపరి చిత్రం బాలయ్యతో ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆ కారణం వల్ల కూడా చరణ్‌కు కావాలని అన్యాయం చేశాడని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. అందుకే చరణ్‌ తన లేఖలో బోయపాటి ప్రస్థావన తీసుకు రాకుండా ఫ్లాప్‌ గురించి వివరణ ఇచ్చాడంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.