3D రామాయణ: రాముడి క్యారెక్టర్ పై చరణ్ క్లారిటీ

పౌరాణిక చిత్రాల్లో నటించడమంటే అంత సాధారణమైన విషయం కాదు.అలాంటి సినిమాలు చేయడానికి నేటితరం హీరోలకు పెద్ద ఛాలెంజ్ అని చెప్పవచ్చు.

 Ram Charan About Ramayana Offer-TeluguStop.com

ఎంతో కఠోర శ్రమ అలాగే దర్శకుడి మేకింగ్ పై నమ్మకం కలిగితేనే తెరపై పాత్రలు ఆకట్టుకుంటాయి.అయితే కెరీర్ లో మొదటిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి రాముడిగా అఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

3D రామాయణ: రాముడి క్యారెక్టర్ ప

ఇటీవల అల్లు అరవింద్ బాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి రామాయణ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.3డి ఫార్మాట్ లో దాదాపు 15 వందల కోట్లతో తెరకెక్కనున్న ఆ సినిమా మూడు భాగాలుగా విడుదల కానుంది.అయితే సినిమాలో రాముడి పాత్రకోసం మొదట రామ్ చరణ్ ని అనుకున్నారట.

ముందే అల్లు అరవింద్ మేనల్లుడిని అడగ్గా అందుకు వీలుపడదని మెగా హీరో సున్నితంగా తిరస్కరించాడట.

రీసెంట్ దర్శకులు నితేశ్ తివారి – రవి ఉద్యావర్ లు కూడా రామ్ చరణ్ పేరును ప్రస్తావించగా చెర్రీ ఈ అఫర్ ను తిరస్కరించినట్లు సమాచారం.

3D రామాయణ: రాముడి క్యారెక్టర్ ప

అందుకు కారణాలు చాలానే ఉన్నాయి.RRR సినిమా ఎండ్ అయ్యే వరకు ఏ సినిమాలో నటించలేని పరిస్థితి ఒకటైతే డేట్స్ కూడా అడ్జస్ట్ చేయలేకపోతున్నాడట.అదే విధంగా రామాయణలో నటిస్తే మూడేళ్లవరకు మరో సినిమాకు సైన్ చేయకూడదు అనే ఒప్పందాలు మెగా తనయుడు తీసుకున్న నిర్ణయానికి ఒక కారణామయి ఉంటాయని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube