రాజకీయాల్లోకి వెళ్తారా అంటే రామ్‌ చరణ్‌ ఏం సమాధానం చెప్పాడో తెలుసా?     2019-01-07   13:21:07  IST  Ramesh Palla

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘వినయ విధేయ రామ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతి కానుకగా రాబోతున్న వినయ విధేయ రామ ప్రమోషన్‌లో భాగంగా రామ్‌ చరణ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను రాజకీయాల గురించి ఆలోచించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.రామ్‌ చరణ్‌ రాజకీయాలు అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం లేక పోలేదు. ఈ చిత్రం వేడుకలో కేటీఆర్‌ మాట్లాడుతూ చరణ్‌ రాజకీయాల్లోకి వస్తే రాణిస్తాడు అన్నాడు.

రామ్‌ చరణ్‌ వినయ విధేయ రామ వేడుకలో మాట్లాడుతూ కేటీఆర్‌ను ఆకట్టుకున్నాడు. కేటీఆర్‌ చరణ్‌ మాటలకు మంత్ర ముగ్దుడు అయ్యాడు. చరణ్‌ చాలా చక్కగా మాట్లాడాడు అంటూ అభినందనలు తెలిపాడు. ఇలా మాట్లాడే వారు రాజకీయాల్లో బాగా రాణిస్తారు అంటూ కేటీఆర్‌ చెప్పుకొచ్చాడు.

Ram Charan About His Entry In Politics-Janasena Party Ktr Niharika Pawan Kalyan Janasena Ram Sai Dharam Varun Tej Vinaya Vidheya Rama Movie Vvr

Ram Charan About His Entry In Politics

అందుకే చరణ్‌ రాజకీయాల్లోకి వెళ్తాడా, రాజకీయాల్లో తన సత్తా చాటుతాడా అంటూ మెగా ఫ్యాన్స్‌లో చర్చ మొదలైంది. తాజాగా ఆ విషయమై ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అందుకు సమాధానం చెప్పుకొచ్చాడు.

Ram Charan About His Entry In Politics-Janasena Party Ktr Niharika Pawan Kalyan Janasena Ram Sai Dharam Varun Tej Vinaya Vidheya Rama Movie Vvr

తాను రాజకీయాల్లోకి వెళ్లాలని భావించడం లేదు. నా కంటే బాగా మాట్లాడే వారు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. బాగా మాట్లాడినంత మాత్రాన రాజకీయాల్లోకి వెళ్లాలని లేదు, రాజకీయాల్లోకి వెళ్లాలి అంటే అంతకు మించి ఉండాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. రాజకీయాల్లో రాణించాలంటే మంచి తెలివి కావాలని పేర్కొన్నాడు. భవిష్యత్తులో రాజకీయాల్లో వెళ్లాలనే ఆలోచన లేదని, మెగా ఫ్యాన్స్‌ సంతోషించే సినిమాలు చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.