చరణ్ 16 ఆ డైరక్టర్ తో ఫిక్స్.. త్వరలో ఎనౌన్స్ మెంట్..!

ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల తర్వాత శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.చరణ్ 15వ సినిమాగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో అంతకుమించిన అంచనాలతో వస్తుంది.

 Ram Charan 16th Movie Director Confirmed  , Ramcharan , Acharya ,  Gowtham Tinnu-TeluguStop.com

ఆర్సీ 15తో పాటుగా త్వరలోనే ఆర్సీ 16వ సినిమా కూడా షురూ చేస్తున్నట్టు తెలుస్తుంది.చరణ్ 16వ సినిమాను కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న గౌతం తిన్ననూరితోనే ఫిక్స్ అయినట్టు ఎక్స్ క్లూసివ్ న్యూస్.

మళ్లీ రావా సినిమాతో హిట్ అందుకుని జెర్సీ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న డైరక్టర్ గౌతం తిన్ననూరి ప్రస్తుతం జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు.

షాహిద్ కపూర్ లీడ్ రోల్ లో నటిస్తున్న బాలీవుడ్ జెర్సీ త్వరలోనే రిలీజ్ ప్లాన్ చేశారు.

ఇక ఆ సినిమా తర్వాత చరణ్ తో గౌతం తిన్ననూరి సినిమా ఉంటుందని తెలుస్తుంది.చరణ్ తో కూడా గౌతం ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తాడని టాక్.

ఆల్రెడీ జెర్సీ అలాంటి నేపథ్యం ఉన్న కథతోనే తెరకెక్కింది.మరి చరణ్ తో గౌతం తిన్ననూరి ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

చరణ్ సినిమా ఛాన్స్ వస్తే గౌతం తిన్ననూరి కూడా స్టార్ డైరక్టర్ లిస్ట్ లో చేరినట్టే లెక్క.ఆర్సీ 16వ సినిమాను ఎన్వీ ప్రసాద్, చరణ్ కలిసి నిర్మిస్తారని ఫిల్మ్ నగర్ టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube