అఫిషియల్‌ : చరణ్‌ - శంకర్‌ ల మూవీ క్లాప్‌ పడే తేదీ ఖరారు

టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌ మరియు తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ ల కాంబోలో దిల్‌ రాజు నిర్మిస్తున్న సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Ram Charan 15th Movie Under Shankar Direction News-TeluguStop.com

ఈ నెలలో రామ్‌ చరణ్‌ నటిస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా చిత్రీకరణ ముగుస్తుంది.ఆ వెంటనే రామ్‌ చరణ్‌ కొత్త సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యేందుకు డేట్‌ కూడా ఫిక్స్ అయ్యింది.

యూనిట్‌ సభ్యుల ద్వారా అందుతున్న అఫిషియల్‌ సమాచారం ప్రకారం ఈ సినిమా ను సెప్టెంబర్‌ 8వ తారీకున పట్టాలు ఎక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను కేవలం ఆరు నుండి ఏడు నెలల్లోనే పూర్తి చేస్తారట.

 Ram Charan 15th Movie Under Shankar Direction News-అఫిషియల్‌ : చరణ్‌ – శంకర్‌ ల మూవీ క్లాప్‌ పడే తేదీ ఖరారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Film News, Kiar Adwani, News In Telugu, Ram Charan, Rc15, Rc15 Movie-Movie

ఈమద్య కాలంలో శంకర్‌ సినిమాలు ఏవీ కూడా ఇంత త్వరగా పూర్తి అయ్యింది లేదు.ఈ సినిమా అయినా అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది అంటూ నెటిజన్స్ నుండి మెగా అభిమానుల వరకు ప్రతి ఒక్కరు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.మొదటగా ఒక భారీ సాంగ్‌ ను చిత్రీకరించబోతున్నారట.ఆ పాటకు సంబంధించిన సెట్‌ ను ఏర్పాటు చేస్తున్నారు.ఆ సెట్‌ కోసమే కోట్లు ఖర్చు చేస్తున్నాడు.

రాజమౌళి తర్వాత ఈమద్య కాలంలో అంతటి భారీ సినిమాలు తీస్తున్నది శంకర్‌.అంతకు ముందు శంకర్‌ టాప్‌ లో ఉండేవాడు.

రామ్‌ చరణ్ తో చేయబోతున్న సినిమా బడ్జెట్‌ దాదాపుగా 250 కోట్లుగా చెబుతున్నారు.సినిమా పూర్తి అయ్యే వరకు దీని బడ్జెట్‌ మరో 50 కోట్లు పెరిగినా ఆశ్చర్యం లేదు.

మొత్తానికి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభోత్సవం తేదీని అనౌన్స్ చేసేందుకు సిద్దం అయ్యారు.సినిమా విడుదల తేదీని వచ్చే ఏడాది లేదా 2023 సంక్రాంతికి ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.

#Ram Charan #RC #Kiar Adwani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు