ఆర్‌సీ15 మరో కీలక అప్‌డేట్.. శంకర్ సర్ ఇంత స్పీడ్ ఏంటీ?

Ram Charan 15th Movie Shooting Second Schedule Over

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా ఇటీవలే పట్టాలెక్కిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పుణె లో ఇప్పటికే పూర్తి చేసిన విషయం తెల్సిందే.

 Ram Charan 15th Movie Shooting Second Schedule Over-TeluguStop.com

భారీ యాక్షన్ సన్నివేశాలను ఆ షెడ్యూల్‌ లో రూపొందించారు.ఆ వెంటనే హైదరాబాద్‌ లో భారీ షెడ్యూల్ ను చేస్తున్నట్లుగా ప్రకటించారు.

మొదటి షెడ్యూల్‌ లో హీరోయిన్‌ కియారా అద్వానీ కనిపించలేదు.కాని సెకండ్ షెడ్యూల్‌ లో మాత్రం ఆమె కూడా పాల్గొంటున్నట్లుగా వార్తలు వచ్చాయి.

 Ram Charan 15th Movie Shooting Second Schedule Over-ఆర్‌సీ15 మరో కీలక అప్‌డేట్.. శంకర్ సర్ ఇంత స్పీడ్ ఏంటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆమె హైదరాబాద్‌ కు రావడంతో ఆ వార్తలు నిజమే అని తేలిపోయింది.ఇక రామ్‌ చరణ్‌ మరియు కియారా ల మద్య కీలక సన్నివేశాలతో పాటు ఒక పాట చిత్రీకరించారట.

ఈ పాట చిత్రీకరణ కోసం జానీ మాస్టర్ అద్బుతమైన స్టెప్పులను కంపోజ్ చేయడం జరిగిందట.

తాజాగా చత్ర యూనిట్‌ సభ్యులు ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు.

సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ కూడా పూర్తి అయ్యిందని ఆయన అప్డేట్ ఇచ్చాడు.మళ్లీ డిసెంబర్‌ లో షెడ్యూల్‌ ఉంటుందా లేదా ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల అయ్యే వరకు రామ్‌ చరణ్‌ ఆ పనుల్లో ఉంటాడా అనేది చూడాలి.

శంకర్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు.ఆయన ఈ సినిమా ను ఛాలెంజ్ గా తీసుకుని కేవలం ఆరు నెలల్లో పూర్తి చేస్తానంటున్నాడు.

Telugu Kiara Advani, Pan India Mvoie, Ram Charan, Ram Charan Rc, Rc, Schedule, Shankar, Tollywood-Movie

దిల్‌ రాజు ఈ సినిమా ను దాదాపుగా 250 కోట్ల బడ్జెట్‌ తో నిర్మిస్తున్నట్లుగా చెబుతున్నారు.పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందుతుందట.తమిళం మరియు తెలుగు భాషల్లో వేరు వేరుగా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.తెలుగు మరియు తమిళంలో కొందరు నటీ నటులు వేరు వేరుగా ఉంటారని కూడా చెబుతున్నారు.

 శంకర్ సినిమా స్పీడ్‌ చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇంత స్పీడ్‌ గా ఆయన ఇతర సినిమాలను కూడా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

#India Mvoie #Ram Charan #RC #Schedule #Kiara Advani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube