టీడీపీ నాటకాలు ఆడుతోంది

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీ ప్రస్తుతానికి నిశబ్దంగా ఉన్నా, త్వరలోనే పేళే అవకాశాలు మాత్రం దండిగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు మరియు రాజకీయ ప్రముఖులు అంటున్నారు.2014లోనే ‘జనసేన పార్టీని ప్రారంభించిన పవన్‌ కళ్యాణ్‌ అప్పటి నుండి కూడా పార్టీని సంస్థాగతంలో ముందుకు తీసుకు వెళ్లకుండా ఉన్నాడు.ఇప్పటి వరకు సభ్యత్వ నమోదును కూడా ప్రారంభించింది లేదు.త్వరలోనే పార్టీని క్రియాశీలకంగా మార్చాలని పవన్‌ భావిస్తున్నాడు.2019 ఎన్నికల సమయం వరకు పార్టీని బలమైన పార్టీగా నిలిపే యోచనలో ఉన్నాడు.అందుకు అబ్బాయి చరణ్‌ హెల్ప్‌ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 Ram Cahran As Yuvasena President..?-TeluguStop.com

జనసేన పార్టీ యువజన విభాగం యువసేన అధ్యక్షుడిగా రామ్‌ చరణ్‌ను నియమించే ఆలోచనలో పవన్‌ కళ్యాణ్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది.రామ్‌ చరణ్‌ కూడా రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నాడు.

దాంతో 2019 ఎన్నికల్లో రామ్‌ చరణ్‌ క్రియా శీలక పాత్ర పోషిస్తాడని మెగా సన్నిహితులు అంటున్నారు.బాబాయికి సాయంగా యువసేన అధ్యక్షుడిగా రామ్‌ చరణ్‌ తనదైన పాత్ర పోషించే అవకాశాలున్నాయి.

బాబాయి, అబ్బాయిలు కలిస్తే రాజకీయాల్లో జనసేన దుమ్ము రేపడం ఖాయం అని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.మరి ఈ వార్తలు నిజమయ్యేనో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube