వారిద్దరు శ్రీనువైట్ల ఫోన్‌ ఎత్తడం లేదు!

‘బ్రూస్‌లీ’ సినిమా ఫ్లాప్‌తో శ్రీనువైట్ల కెరీర్‌ ఖతం అయినట్లే అని కొందరు సినీ వర్గాల వారు అంటున్నారు.‘బ్రూస్‌లీ’ కంటే ముందు ‘బాద్‌షా’, ‘ఆగడు’ చిత్రాలు కూడా శ్రీనువైట్ల కెరీర్‌ నాశనంకు దోహదం చేశాడు.

 Heroes Avoiding Srinu Vaitla..?-TeluguStop.com

ఈ మూడు సినిమాలు కూడా శ్రీనువైట్లను నిండా ముంచేశాయి.ఎంతో కష్టపడి తెచ్చుకున్న పేరును ఈ మూడు సినిమాలతో శ్రీనువైట్ల చెడగొట్టుకున్నాడు.

గతంలో ఈయన దర్శకత్వంలో నటించాలని స్టార్‌ హీరోలు ఉవ్విల్లూరేది.కాని ఇప్పుడు పరిస్థితి మారింది.

ప్రస్తుతం ఈయన హీరో కోసం వెదికే పనిలో ఉన్నాడు.ఇప్పటికే తన వద్ద ఉన్న ఒక కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ఒక సినిమా తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు.

అయితే ఆ కథను వినేందుకు ఏ ఒక్క హీరో కూడా ముందుకు రావడం లేదు.ఈయన గతంలో రవితేజ, రామ్‌లతో సినిమాలు చేసిన విషయం తెల్సిందే.

తన ముందు ఆప్షన్‌గా ఉన్న వీరిద్దరిని కలిసేందుకు శ్రీనువైట్ల ప్రయత్నించాడట.కాని ఇద్దరు కనీసం శ్రీనువైట్ల ఫోన్‌ కూడా లిఫ్ట్‌ చేయడం లేదని అంటున్నారు.

దాంతో శ్రీనువైట్ల మరో చిన్న హీరోను వెదికే పనిలో ఉన్నాడు.బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube