మళ్ళీ కిషోర్ తిరుమల కావాలంటున్న రామ్! అంత కాన్ఫిడెన్స్ ఏంటో  

మూడో సారి జత కడుతున్న రామ్, కిషోర్ తిరుమల.

Ram And Kishore Tirumala Combination Repeat-ram And Kishore Tirumala,telugu Cinema,tollywood

టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరో అంటే అందరూ వెంటనే చెప్పే పేరు రామ్. అతని ఎనర్జీ హైలో ఉన్న దానికి సరిపడే సినిమా అతని కెరియర్ లో చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పాలి అందుకే టాలెంట్ ఉన్న కూడా ఎవరేజ్ హీరోగా ఉండిపోయాడు. అయితే ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ తో రామ్ తన ఎనర్జీ లెవల్స్ ని చూపించడానికి సిద్ధం అయిపోయాడు..

మళ్ళీ కిషోర్ తిరుమల కావాలంటున్న రామ్! అంత కాన్ఫిడెన్స్ ఏంటో-Ram And Kishore Tirumala Combination Repeat

తెలంగాణ హైదరాబాద్ స్లాగ్ తో తాజాగా రిలీజ్ అయిన టీజర్ లో రచ్చ చేసాడనే చెప్పాలి. ఇక సినిమా కంటెంట్ లెవల్ బట్టి థియేటర్స్ లో సినిమా ఎలా ఉంటుంది అని తెలిసిపోతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ మళ్ళీ తన లక్కీ దర్శకుడు కిషోర్ తిరుమలతో సినిమా చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది.

ఇది కూడా సొంత బ్యానర్ అయిన స్రవంతి క్రియేషన్స్ లో తెరకెక్కుతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే నేను శైలజ, ఉన్నదీ ఒక్కటే జిందగీ సినిమాలతో తనదైన హిట్స్ కొట్టిన వీరిద్దరి కాంబినేషన్ లో మూడో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ తర్వాత ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది.