వైరల్: కాలినడకన తిరుపతికి వెళ్లిన కుక్క.. అసలు మ్యాటర్ ఏంటంటే..!?- Ral The Dog Who Went To Tirupati On Foot What Is The Real Matter

viral the dog who went to tirupati on foot what is the real matterdog walk, thirupathi, viral news, viral lates, 650km, milk, food - Telugu 650km, Dog Walk, Food, Milk, Thirupathi, Viral Lates, Viral News

తాజాగా ఒక శునకం చేసిన పని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఆ కుక్కకు పాలు పోశారన్న  విశ్వాసంతో ఒక ఇద్దరి భక్తులతో కలసి జంగారెడ్డిగూడెం నుంచి తిరుపతి వరకు ఆ కుక్క కాలినడకన వారికి తోడుగా వెళ్ళింది.

 Ral The Dog Who Went To Tirupati On Foot What Is The Real Matter-TeluguStop.com

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

జంగారెడ్డిగూడెం కి చెందిన ముడి ప్రతాపరెడ్డి, అతని స్నేహితుడు రవి ఇద్దరూ కలిసి మార్చి 15న కాలినడక మార్గగా తిరుపతికి వెళ్లేందుకు బయలుదేరారు .వాస్తవానికి కాలినడకన ఇలా తిరుపతి కి వెళ్లడం ప్రతాపరెడ్డికి  ఇది మొదటిసారి ఏమీ కాదు ఇది మూడోసారి.ఈసారి తనతో పాటు ఎవరైనా భక్తులు వస్తే వారిని కూడా తీసుకు వెళ్దామని నిర్ణయించుకున్నారు.

 Ral The Dog Who Went To Tirupati On Foot What Is The Real Matter-వైరల్: కాలినడకన తిరుపతికి వెళ్లిన కుక్క.. అసలు మ్యాటర్ ఏంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా వారికీ అయ్యే ఖర్చు మొత్తం తానే పెట్టుకోవాలని కూడా అనుకున్నాడు.కానీ ఏ భక్తులు కూడా ముందుకు రాలేదు.దీనితో వారిద్దరు కలిసి జంగారెడ్డిగూడెం నుంచి తిరుపతికి కాలినడకన బయలుదేరారు.ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకోగా వీరికి 2 కుక్కలు కలిసాయి.

అప్పటికీ వారు ఆ కుక్కలని అదిలించినప్పటికీ కూడా కానీ వారి వెంటనే వారితో పాటు నడకను కొనసాగించాయి. కొద్దీ ప్రయాణం తర్వాత ఒక శునకం తిరిగి వెనక్కి వెళ్లిపోగా మరొకటి మాత్రం వీరి వెంటనే నడవడం కొనసాగించింది.

వారిద్దరు దానికి పాలు పోసి, అలాగే వారు తినే ఆహారంలో కూడా పెడుతూ ఉండేవాడు దాదాపు 650 కిలోమీటర్లు వీరితో పాటే ఆ శునకం తిరుపతికి కాలినడకన వెళ్ళింది వారిద్దరూ కలిసి మార్గమధ్యములో ఆ కుక్కకు నంది అనే పేరును కూడా నామకరణం చేశారు.ఇక తిరుమలలో మెట్ల దారి గుండా వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది కొండపైకి ఆ కుక్క ను తీసుకుపోవడానికి అభ్యంతరం వ్యక్తం చేయగా, అక్కడే ఉన్న తన బంధువుల ఇంటికి  ఆ కుక్కను చేర్చాడు.

ప్రతాప్ రెడ్డి, రవి ఇద్దరు శ్రీవారి దర్శనం అనంతరం జంగారెడ్డిగూడెంకి వారిద్దరితో కలిసి కార్ లో ఆ కుక్కను కూడా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు.ప్రస్తుతానికి ఆ కుక్కను ప్రతాపరెడ్డి ఇంటిలోనే పెంచుకుంటూ ఉన్నాడు.

#Thirupathi #Milk #Dog Walk #Viral Lates #650km

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు