ట్రక్కు డ్రైవర్ గా మారిన స్టార్ హీరోయిన్ !

సినిమాల్లో నటులు చేసే పాత్రలో వారు ఒక గుర్తింపుతో కూడిన పాత్రలో నటిస్తుంటారు.కొన్ని సినిమాలలో హీరో ఏమి చేయలేని నిరుద్యోగిగా ఉంటే, హీరోయిన్ మాత్రం ఏదో ఒక గుర్తింపు పొందిన ఉద్యోగంతో లీనమవుతుంది.

 Rakulpreet Singh Turns As Truck Driver Rakul Preet Singh, Tollywood, Truck Drive-TeluguStop.com

కొన్ని సినిమాలలో ఇద్దరు కలిసి ఉద్యోగం చేయడం వంటి పాత్రలు కూడా చేస్తుంటారు.ఇదిలా ఉంటే తాజాగా మరో బ్యూటీ ట్రక్కు డ్రైవర్ గా నటించిందట.

ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో కాదు.

టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.

ఈమె నటన గురించి అందరికీ తెలిసిందే.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా నటించగా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

Telugu Sardarka, Tollywood, Truck-Movie

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె అర్జున్ కపూర్ తో కలిసి హిందీలో సర్దార్ కా గ్రాండ్ సన్ అనే సినిమాలో నటిస్తుంది.ఇక ఈ సినిమాలో సరికొత్త పాత్రలో రకుల్ కనిపించగా అది కూడా ట్రక్కు డ్రైవర్ గా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా ఈ విషయం గురించి ఆమె కొన్ని విషయాలు మాట్లాడుతూ.

తనకు వ్యక్తిగతంగా డ్రైవింగ్ చేయడం ఇష్టమట.

ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం చాలా ఫన్నీగా సాగిందని తెలిపింది.ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర డ్రైవర్ గా ఉండగా ట్రక్కు డ్రైవింగ్ చేయడం అంత సులభం కాదని తెలిపింది.

కాని తను చాలా సులభంగా కాన్ఫిడెంట్ గా డ్రై చేశానని తెలిపింది.అంతేకాకుండా ట్రక్కు ని ఎలా డ్రైవ్ చేయాలో చెప్పేందుకు కూడా సెట్స్ లో ట్రక్కు డ్రైవర్ కూడా ఉండేవాడట‌.

ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పేవాడట.తన డ్రైవింగ్ స్కిల్స్ చూసి సెట్ లో అందరూ చూసి షాక్ అయ్యారట.

ఇక జీవితంలో ఇలాంటి అనుభూతి ఒక్కసారి మాత్రమే వస్తుందంటూ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube