చెక్ ప్రమోషన్స్ కు దూరంగా రకుల్.. కారణమిదేనా..?  

rakul preet singh maintain distance with check movie promotions, nithin, rakul, check movie, promotions, distance, bollywood movies, busy schedule, chandra sekhar aleti - Telugu Bollywood Movies, Busy Schedule, Chandra Sekhar Aleti, Check Movie Promotions, Distance, February 26, Maintain Distance, Nithin, Rakul Preet Singh

కెరటం అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన రకుల్ కు సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా నటిగా మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు తెలుగులో హీరోయిన్ గా తొలి విజయాన్ని ఇచ్చింది.ఆ తరువాత మిడిల్ రేంజ్ హీరోయిన్లతో ఎక్కువగా నటించిన రకుల్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు జోడీగా నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

TeluguStop.com - Rakulpreet Maintains Distance From Nithin Check Promotions

నాన్నకు ప్రేమతో, ధృవ, సరైనోడు సినిమాలు రకుల్ కు సక్సెస్ తో పాటు స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి.అయితే ఆ తరువాత రకుల్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం రకుల్ కెరీర్ కు మైనస్ గా మారడంతో పాటు అవకాశాలు తగ్గడానికి కారణమైంది.

ప్రస్తుతం రకుల్ చెక్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

TeluguStop.com - చెక్ ప్రమోషన్స్ కు దూరంగా రకుల్.. కారణమిదేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image
Telugu Bollywood Movies, Busy Schedule, Chandra Sekhar Aleti, Check Movie Promotions, Distance, February 26, Maintain Distance, Nithin, Rakul Preet Singh-Movie

నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చెక్ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ నితిన్ కు లవర్ పాత్రలో నటించగా రకుల్ లాయర్ గా కనిపించారు.ఈ నెల 26వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా రకుల్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు.రకుల్ సినిమాలో తన పాత్ర పరిధి తక్కువగా ఉండటంతో ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే చిత్ర యూనిట్ మాత్రం బాలీవుడ్ మూవీస్ తో రకుల్ బిజీగా ఉండటం వల్లే ప్రమోషన్లకు హాజరు కావడం లేదని అంతకు మించి మరే కారణం లేదని చెబుతున్నారు.ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గిన రకుల్ చెక్ సినిమా విడుదలైన తరువాత మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

#ChandraSekhar #Distance #February 26 #Nithin #Busy Schedule

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు