అనుష్క చేసిన తప్పును చేయనంటోన్న రకుల్

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఫేడవుట్ అయ్యే దిశగా వెళ్తోంది.చేతిలో అరకొర ఆఫర్లు మాత్రమే ఉన్న ఈ బ్యూటీ చాలా సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటోంది.

 Rakul Says No For Experiments, Rakul Preet Singh, Anushka Shetty, Weight Gain, T-TeluguStop.com

అయితే ప్రస్తుతం తమిళంలో ఇండియన్ 2 చిత్రంతో పాటు బాలీవుడ్‌లో ఒక సినిమా చేస్తున్న ఈ బ్యూటీ, తెలుగులో మళ్లీ తన పాత క్రేజ్‌ను దక్కించుకోవాలని చూస్తోంది.అయితే ఈ బ్యూటీ చేయబోయే పాత్రల విషయంలో చాలా క్లారిటీగా ఉంది.

ప్రస్తుతం తన కెరీర్ ఫేడవుట్ అయినందుకు రకుల్ తనను తానే నిందించుకుంటోంది.గతంలో తాను కేవలం గ్లామర్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని, అందుకే తనకు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు పడలేదని ఆమె చెప్పుకొచ్చింది.

ఇకపై నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేస్తానని, ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని రకుల్ అంటోంది.అయితే నటన కోసం ఎలాంటి మార్పులకైనా ఇష్టపడతారా అని అడిగినప్పుడు రకుల్ పాత్రల కోసం తనను తాను మల్చుకుంటానని, అయితే బరువు పెరగడం, తగ్గడం లాంటివి మాత్రం అస్సలు చేయనంటోంది.

ఇలాంటి తప్పులు చేస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని రకుల్ అంటోంది.సహజంగానే ఫిట్‌నెస్‌ను ఇష్టపడే రకుల్ ఆరోగ్యం పట్ల ఎలాంటి ప్రయోగాలు చేయనని తేల్చేసింది.

గతంలో పాత్ర డిమాండ్ మేరకు అనుష్క బరువు పెరిగి ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆమె గుర్తుకు చేసింది.మొత్తానికి అనుష్క చేసిన తప్పును తాను ఎప్పటికీ చేయబోయనంటూ రకుల్ చెప్పుకొచ్చింది.

మరి రకుల్‌కు టాలీవుడ్‌లో మరోసారి అవకాశం ఎవరు ఇస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube