అన్ని చూపించేసాను... అందుకే ఇప్పుడు ఇలా అంటున్న హీరోయిన్  

Rakul Preeth Singh Comments On Her Glamour Roles - Telugu Bollywood, Glamour Roles, Kollywood, Rakul Preeth Singh Comments, Telugu Cinema, Tollywood

కెరటం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చివెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ కొట్టి తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.ఈ భామ కెరియర్ లో ఎంత జెట్ స్పీడ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయిందో, అంతే స్పీడ్ తో క్రింద పడిపోయింది.

Rakul Preeth Singh Comments On Her Glamour Roles

ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో పెద్దగా సినిమాలు లేవు.బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలలో నటిస్తుంది.

అయితే తెలుగులో మాత్రం చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు.ఇప్పుడు ఈ విషయంలో అమ్మడు కాస్తా రియలైజ్ అయ్యింది.

అవకాశాలు పోయిన తర్వాత అన్ని గుర్తుకొస్తాయి అన్నట్లు ఇప్పుడు రకుల్ కి కూడా కెరియర్ పరంగా చేసిన పొరపాట్లు కళ్ళముందుకి వచ్చాయి.తాజాగా ఈ విషయం మీదనే ఆమె ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది

నేను ఏ డైరెక్టర్ ను ఇబ్బంది పెట్టేదాన్ని కాదు.

షూటింగ్ కు కూడా టైంకి వెళ్ళేదాన్ని.పారితోషికం విషయంలో చాలా తగ్గేదాన్న కాని ఇప్పుడు నాకు అవకాశాలు లేవు.

దానికి కారణం నేను మొదటి నుండీ గ్లామర్ పాత్రలు మాత్రమే చేయడం వల్ల.మొదటి నుండి కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాలని చేసి ఉంటే ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈమె చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి.ఒకటి ఇండియన్ 2 మరొకటి కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేస్తుంది.

అయితే ఆమె టాలీవుడ్ లో తాను చేసిన సినిమాల విషయం ద్రుష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసింది.ఉన్నాయి కదా అని ముందే అన్ని చూపించేస్తే తరువాత చూపించడానికి ఏమీ ఉండవు అన్నట్లు ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో అదే పరిస్థితి వచ్చిందని చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test