ఆమె ఆశలన్నీ మన్మథుడిపైనే!

సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలతో సంబంధం లేకుండా నిలదొక్కుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి.ఆ విషయంలో రకుల్ ప్రీత్ లక్ గట్టిగానే ఉంది.

 Rakul Preeth Sing Hopes On Manmadhudu 2 Movie Telugu Tollywood Updates-TeluguStop.com

గతంలో ఎప్పుడు లేని విధంగా అమ్మడు వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతోంది.అప్పుడెప్పుడో నాగ చైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో హిట్టందుకున్న అమ్మడు ఇంతవరకు టాలీవుడ్ లో సక్సెస్ అందుకోలేదు.

ఆమె ఆశలన్నీ మన్మథుడిపైనే! -  Rakul P

రకుల్ పనైపోయింది అనుకుంటున్న సమయంలో బాలీవుడ్ – కోలీవుడ్ లో ఆఫర్స్ అందుకుంటూ కెరీర్ ను ఒక లెవెల్లో నెట్టుకొస్తోంది.ఇక ఇప్పుడు అమ్మడు తన ఆశలన్నిటిని మన్మథుడు 2పైనే పెట్టుకుంది.కొడుకు ఇచ్చిన హిట్ తండ్రి కూడా ఇస్తాడని ఎంతో నమ్మకంతో ఉంది.నాగ్ సరసన అవంతిక పాత్రలో నటించిన బేబీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పింది.

ఆమె ఆశలన్నీ మన్మథుడిపైనే! -  Rakul P

ఇటీవల బాలీవుడ్ లో దే దే ప్యార్ సినిమాతో సక్సెస్ అందుకున్నప్పటికీ రకుల్ కి పెద్దగా అవకాశాలు రాలేదు.ఇక కోలీవుడ్ లో సూర్యతో చేసిన NGK కూడా కాస్త దెబ్బ కొట్టింది.ఇక ఇప్పుడు నాగ్ తో చేసిన మన్మథుడు 2 ఆగస్ట్ 9న రిలీజ్ కాబోతోంది.సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడంతో తప్పకుండా సక్సెస్ అవుతుందని టాక్ మొదలైంది.

మరి రకుల్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube