రకుల్‌ పరిస్థితి మరీ ఇంతగా దిగజారిందా... అప్పుడు నో చెప్పి ఇప్పుడు ఎస్‌ ఎందుకు చెప్పినట్లో??  

Rakul Preet To Romance Balakrishna In Boyapati Direction-boyapati Movie,nandamuri Fans,rakul Preet Singh

In 2016 - 2017, Rakeel Preet Singh is busy and busy with the movie Mahesh Babu. But the rakul effect was only two years old. From then on, her craze was slowly melted. In 2017, efforts were made to select Rakul Preet Singh in a movie with Balakrishna. But then I do not set up with a senior hero like Rachel Abbey, I'm very busy now, Silly Regains says no dates. If she cut, she is now selected as a pair.

Rakul Preet Singh has been chosen as the heroine in the movie which is going to be directed by Boyapati Srinu. The deal is also completed. Rakul has not acted in any other film except in the movie 'hero' She did not have the original offers to commit. Rakul Preet Singh immediately told Balayya movie, with the intention of not missing the opportunity to come. This is a movie which is being produced by three Tamil films in Tamil. Soon comes the audience with the movie Balayya movie.

. Now, why is it that this boy who has not been told to sell it in the past is going to be back to the fans of Nandamuri on Boyapati. In some cases, some of the social media is demanding that Balayya do not accept her. But in the case of Rakul, Balayya seems to be keen. NTR is the heroine of the film and she has played the role of Sridevi in the film. Balakrishna is going to be seen in Boapati Movie after NTR's Mahanayagam. .......

2016 – 2017లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంత బిజీగా ఉందంటే మహేష్‌బాబు మూవీకి కూడా నో చెప్పినంత బిజీ. కాని రకుల్‌ ప్రభావం ఆ రెండేళ్లు మాత్రమే అయ్యింది. ఆ తర్వాత నుండి ఆమె క్రేజ్‌ మెల్ల మెల్లగా తగ్గింది. 2017వ సంవత్సరంలో బాలకృష్ణతో ఒక మూవీలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కాని అప్పుడు రకుల్‌ అబ్బే మరీ అంత సీనియర్‌ హీరోతో నేను సెట్‌ అవ్వను, నేను ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను, డేట్లు లేవు అంటూ సిల్లీ రీజన్స్‌ చెప్పిందట..

రకుల్‌ పరిస్థితి మరీ ఇంతగా దిగజారిందా... అప్పుడు నో చెప్పి ఇప్పుడు ఎస్‌ ఎందుకు చెప్పినట్లో??-Rakul Preet To Romance Balakrishna In Boyapati Direction

కట్‌ చేస్తే ఇప్పుడు బాలయ్యకు జోడీగా ఆమె ఎంపిక అయ్యింది.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మూవీలో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంపిక అయ్యింది. అందుకు సంబంధించిన ఒప్పందం కూడా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.

తెలుగులో రకుల్‌ ఈమద్య కాలంలో ‘కథానాయకుడు’ చిత్రంలో నటించింది తప్ప మరే సినిమాకు కమిట్‌ కాలేదు. కమిట్‌ అవ్వడానికి ఆమె వద్దకు అసలు ఆఫర్‌లు రాలేదు. దాంతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వచ్చిన అవకాశంను మిస్‌ చేసుకోవద్దనే ఉద్దేశ్యంతో వెంటనే బాలయ్య మూవీకి ఓకే చెప్పింది. తమిళంలో మూడు నాలుగు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు త్వరలోనే తెలుగులో బాలయ్య మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నమాట.

గతంలో బాలయ్యకు నో చెప్పిన ఈ అమ్మడిని మళ్లీ ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు అంటూ బోయపాటిపై నందమూరి అభిమానులు సీరియస్‌ అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాలయ్య ఆమెను ఒప్పుకోవద్దని సోషల్‌ మీడియాలో కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. కాని రకుల్‌ విషయంలో బాలయ్య ఆసక్తిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రంలో శ్రీదేవిగా నటించి మెప్పించింది కనుకే బాలయ్య ఈమెకు తన తర్వాత సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌ పాత్రను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రం విడుదలైన తర్వాత బోయపాటి మూవీలో బాలకృష్ణ నటించబోతున్నాడు.