రకుల్‌ను స్పెషల్‌గా తీసుకు రాబోతున్న మన్మధుడు.. అంత ప్రత్యేకం ఎందుకో?  

Rakul Preet Special Attraction In Manmadhudu 2 Teaser-manmadhudu 2 Movie,manmadhudu 2 Teaser,rakul Preet Singh,ravikiran

నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు 2 చిత్రంలో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన విషయం తెల్సిందే. తాజాగా విడుదలైన టీజర్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లేకపోవడం చర్చనీయాంశం అయ్యింది. పలువురు ఇతర నటీనటులు ఉన్నారు కాని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాత్రం కనిపించలేదు. దాంతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎందుకు లేదనే చర్చ మొదలైంది..

రకుల్‌ను స్పెషల్‌గా తీసుకు రాబోతున్న మన్మధుడు.. అంత ప్రత్యేకం ఎందుకో?-Rakul Preet Special Attraction In Manmadhudu 2 Teaser

తాజాగా ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది. మీడియాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు సినిమాలో పెద్దగా ప్రాముఖ్యత లేదు అంటూ వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టడం జరిగింది.

మన్మధుడు 2 చిత్రంలో రకుల్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుందని, అందుకే ఆమె కోసం స్పెషల్‌ టీజర్‌ను రెడీ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టీజర్‌ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రకుల్‌ టీజర్‌తో సినిమా స్థాయి మరింతగా పెరగడం ఖాయం. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ చిత్రంలో చాలా విభిన్నంగా కనిపించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది..

రకుల్‌ ఈ చిత్రంలో నాగార్జునకు లవర్‌గా కనిపించబోతుంది. ఈమద్య కాలంలో రకుల్‌కు సక్సెస్‌లు లేవు.

ఇలాంటి సమయంలో రాబోతున్న మన్మధుడు 2 పై ఆమె చాలా ఆశలు పెట్టుకుని ఉంది. మరి ఆమె ఆశలు నిలిచేనా, ఆమె అనుకున్నట్లుగా ఈ చిత్రం సక్సెస్‌ అయ్యి మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అయ్యేనా చూడాలి. ఈ అమ్మడు తమిళం మరియు బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తోంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి..