సైకిల్ పై షూటింగ్ కి వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్  

సౌత్ ఇండియా హీరోయిన్లు ఎక్కువగా ఫిట్ నెస్ ఫ్రీక్ గా ఉంటారు.కెరియర్ ఆరంభం నుంచి కేవలం సినిమాల మీదనే కాకుండా గ్లామర్ దెబ్బతినకుండా రెగ్యులర్ గా వర్క్ అవుట్స్ చేస్తూ ఉంటారు.

TeluguStop.com - Rakul Preet Singh Went To Mayday Shooting By Cycle

ఈ మధ్యకాలంలో హీరోయిన్లుకి ఫిట్ నెస్ మీద మరింత శ్రద్ధ పెరిగింది.ఫుడ్ డైట్ నుంచి ప్రతి విషయంలో కేర్ తీసుకుంటున్నారు.

మగాళ్లతో సమానంగా వర్క్ అవుట్స్ చేస్తూ బరువులు ఎత్తే భామలు కూడా ఉన్నారు.వారిలో ముందు వరుసలో సమంత, రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తారు.

TeluguStop.com - సైకిల్ పై షూటింగ్ కి వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ ఇద్దరు భామలు క్రమం తప్పకుండా వర్క్ అవుట్స్ చేస్తూ ఉంటారు.అప్పుడప్పుడు వారి వర్క్ అవుట్స్ కి సంబందించిన ఫోటోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు.

రకుల్ ప్రీత్ సింగ్ అయితే సొంతంగా ఒక ఫిట్ నెస్ స్టూడియో కూడా పెట్టింది.ఇదిలా ఉంటే ఈ భామ ఆ మధ్య కరోనా బారిన పడింది.

కరోనా నుంచి వేగంగా కోలుకోవడానికి వర్క్ అవుట్స్ నే మార్గంగా ఎంచుకుంది.

ఇక కరోనా నుంచి బయటపడిన తర్వాత వెంటనే షూటింగ్ లో జాయిన్ అయిపొయింది.

ప్రస్తుతం ఈ భామ అజయ్ దేవగన్, అమితాబచ్చన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మేడే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో ఆమె ఫైలట్ గా కనిపించబోతుంది.ఇదిలా ఉంటే రకుల్ కి సైక్లింగ్ అంటే ఎక్కువ ఇష్టం.ఆ మధ్యకాలంలో మంచు లక్ష్మితో కలిసి రకుల్ సైక్లింగ్ చేసింది.

తాజాగా ఏకంగా 12 కిలోమీటర్లు సైక్లింగ్ చేసుకుంటూ మేడే షూటింగ్ కి ఈ అమ్మడు వెళ్ళింది.దీనికి సంబందించిన వీడియోలో సోషల్ మీడియాలో షేర్ చేసి మేడే షూటింగ్ కోసం సైకిల్ మీద వెళ్లినట్లు తెలిపింది.

త్వరలో వంద కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తానని తన పోస్ట్ లో పేర్కొంది.

.

#Samantha #Cycle #Ajay Devagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు