టెన్షన్‌ టెన్షన్‌ : డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరైన రకుల్‌  

rakul preet singh went to in front of ncb for drugs case Rakul Preeth Singh, NCB Officers, Deepkia Padukune, Sara Alikhan, Bollywood Drugs Case, - Telugu Bollywood News, Deepika Padukune, Drugs Case, Rakul Preet Singh, Telugu Film News

డ్రగ్స్ కేసులో పలువురు హీరోయిన్స్ కు ఎన్‌సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే తోపాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ కేసులో సమన్లు అందుకుంది.

TeluguStop.com - Rakul Preet Singh Went To In Front Of Ncb For Drugs Case

నేడు ఎన్‌సీబీ అధికారుల ముందుకు వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పనుంది.డ్రగ్స్ కేసులో ఆమెకు ఉన్న లింకేంటి అనేది నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి కూడా ఎన్‌సీబీ అధికారులు మూడు నాలుగు సార్లు విచారించి ఆ తర్వాత అరెస్ట్ చేశారు.ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా నేడు ఎన్‌సీబీ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ఆమె అభిమానులు ఆందోళనతో ఎదురు చూస్తున్నారు.

TeluguStop.com - టెన్షన్‌ టెన్షన్‌ : డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరైన రకుల్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

టాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఒకానొక సమయంలో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగింది.మధ్య కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ కాస్త డల్‌ అయినట్లుగా అనిపించినా కూడా పలువురు స్టార్ హీరోలకు ఇప్పటికి ఈమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌ గానే ఉంది.

ఈ సమయంలో ఆమెకు డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉన్నట్లుగా వెల్లడి కావడంతో అధికారులు విచారణకు పిలిచారు.విచారణలో ఏం జరుగబోతుంది అంటూ అభిమానులు టెన్షన్ టెన్షన్ గా వెయిట్ చేస్తున్నారు.

విచారణకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ముగిసిన తర్వాత జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.ఆ సమయంలో ఆమె ఏం చెప్పనుంది అనేది అందరిలో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.

డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే విషయంలో రకుల్‌ నుండి ఎన్‌సీబీ అధికారులు స్పష్టత తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.రకుల్ ప్రీత్ సింగ్ కు రియా చక్రవర్తి సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగానే ఆమెను విచారిస్తున్నారు తప్పితే రకుల్ కేసుతో సంబంధం ఉండి ఉండదు అంటూ ఆమె అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.

ఏది ఏమైనా అసలు విషయం ఏంటి అనేది ఈ రోజు సాయంత్రం గాని తెలిసే అవకాశం ఉంది.

#Drugs Case

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rakul Preet Singh Went To In Front Of Ncb For Drugs Case Related Telugu News,Photos/Pics,Images..