పాన్ ఇండియా సినిమాలకు నేనేం తక్కువ కాదు.. ట్రై చేయండి

ఈమద్య కాలంలో సౌత్ సినిమా స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమా లపై ఆసక్తి చూపిస్తున్నారు.ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా సినిమా లను చేసేందుకు ఆసక్తిగా ఉన్న ఈ సమయంలో హీరోయిన్స్ కూడా ఆ స్థాయి వారు కావాలని అనుకుంటున్నారు.

 Rakul Preet Singh Want To Do Pan India Movie , Flim News, Pan India Movie, Rakul-TeluguStop.com

అన్ని భాషల్లో గుర్తింపు ఉండి.స్టార్‌ డమ్‌ ఉన్న వారిని తీసుకోవడం వల్ల పాన్ ఇండియా స్థాయిలో మంచి ఇమేజ్ దక్కే అవకాశం ఉంటుంది.

అందుకే పాన్ ఇండియా సినిమాలకు మంచి డిమాండ్‌ ఉందంటూ హీరోయిన్స్‌ ఎక్కువగా అలాంటి సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేసేందుకు గాను ఎంతో మంది హీరోయిన్స్ ఆసక్తిగా ఉన్నారు.

ఇలాంటి సమయంలో పాన్ ఇండియా స్టార్స్‌ ఒక సారి తన వైపు చూడాలి అంటూ రకుల్‌ ప్రీత్‌ సింగ్ విజ్ఞప్తి చేస్తోంది.

Telugu Pan India, Rakul, Tollywood-Movie

తాను తెలుగు.తమిళంతో పాటు ఇతర భాషల్లో గుర్తింపు కలిగి ఉన్నాను.ఇతర భాషల్లో కూడా మాట్లాడగలను.

అందుకే నేను పాన్ ఇండియా సినిమా లకు మంచి ఛాయిస్.కనుక నన్ను హీరోయిన్‌ గా పాన్‌ ఇండియా సినిమా లకు తీసుకుని ట్రై చేయండి అంటూ రకుల్‌ ప్రీత్‌ సింగ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

తనను తాను పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్ అంటూ ప్రొజెక్ట్‌ చేసుకునేందుకు రకుల్‌ చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.కాని ఇప్పుడు ఆమె పాన్ ఇండియా సినిమా లకు ఎంత వరకు వర్కౌట్‌ అవుతుంది అనేది మేకర్స్‌ నిర్ణయించుకోవాలి.

పాన్ ఇండియా స్టార్‌ హీరోలు కూడా ఆమెతో రొమాన్స్ కు సిద్దంగా ఉండాలి.ప్రస్తుతం ఆమె వరుసగా సినిమాలు చేస్తోంది.

హిందీలో కూడా సినిమాలు చేస్తున్న ఆమె ముందు ముందు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఆ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసుకోవాలనే సలహాలు కూడా వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube