టాలీవుడ్లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తెలుగు హీరోలు సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు.
కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.
వీరి పాత్రలకు సంబంధించి ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఒకటి ప్లాన్ చేశాడట దర్శకుడు రాజమౌళి.
ఈ ఐటెం సాంగ్‌లో ఎవరిని తీసుకుందామా అని రాజమౌళి ఆలోచిస్తుండగా, రామ్ చరణ్ ఓ బ్యూటీ పేరును రికమెండ్ చేశాడట.టాలీవుడ్లో స్టార్ బ్యూటీగా తన సత్తా చాటుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ పేరును చరణ్ రికమెండ్ చేశాడు.
కాగా చరణ్‌తో రకుల్ రెండు సినిమాలు చేయడంతో ఆమెను తీసుకునేందుకు జక్కన్న ఈ ఐటెం సాంగ్‌లో తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఫారిన్ బ్యూటీ ఒలివియా మారిస్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాలో వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.