చెమటోడుస్తున్న రకుల్.. ఎందుకో ఈ కష్టాలు?

సెలిబ్రిటీలు తమ ఫిట్‌నెస్‌ను మెయింటెయిన్ చేసేందుకు జిమ్‌లకు పరుగులు తీస్తుంటారు.వీరిలో హీరోలే ఎక్కువగా ఉండేవారు.

 Rakul Preet Singh Sweating Gym-TeluguStop.com

కానీ సమయం మారిన కొద్దీ హీరోయిన్లు కూడా జిమ్‌లకు వెళ్లి నాజుగ్గా తయారవుతున్నారు.ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో టాప్ స్టార్స్ మొదలుకొని కొత్తవారి వరకు అందరూ తమ దేహానికి పనిచెప్పి జిమ్‌లో చెమటోడుస్తున్నారు.

ఇందులో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పేరు రకుల్ ప్రీత్ సింగ్.టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిపోతున్న ఈ బ్యూటీ తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు రోజు జిమ్‌లో చాలా కష్టపడుతోంది.

ఇప్పటికే రకుల్ జిమ్‌లో చేసే వ్యాయామాలకు సంబంధించిన వీడియోలు మనం చాలా చూశాం.కాగా తాజాగా రకుల్ జిమ్‌లో అబ్బాయిలకు సైతం చాలా కష్టమైన వర్కవుట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

తన ఫిట్‌నెస్ అంటే తనకు ఎంతో ఇష్టమని రకుల్ అంటోంది.ఇలా జిమ్‌లో చెమటోడుస్తుంది కాబట్టే రకుల్ అంత స్లిమ్‌గా అందంగా ఉందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

ఏదేమైనా యూత్‌లో రకుల్ ఉన్న ఫాలోయింగ్‌, క్రేజ్‌ను ఆమె మరోసారి దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube