సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్న రకుల్‌  

Reason behind Rakul Preet Singh Not Interest on Social Media, Drugs case, Social Media, Rakul Preet Singh, Bollywood, NCB Officials, Followers - Telugu Bollywood, Deepika Padukune, Drugs Case, Followers, Ncb Officials, Rakul In Drugs Case, Rakul Preet Shingh, Rakul Preet Singh, Reason Behind Rakul Preet Singh Not Interest On Social Media, Social Media

ఈమద్య కాలంలో హీరోయిన్స్‌ రోజుకు రెండు మూడు పోస్ట్‌లు సోషల్‌ మీడియాలో పెట్టకుండా ఉండరు.ముఖ్యంగా కాసులు కురిపిస్తున్న ఇన్‌ స్టా గ్రామ్‌ లో స్టార్‌ హీరోయిన్స్‌ నుండి చిన్న హీరోయిన్స్‌ వరకు ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్‌ గా ఫోస్టు పెడుతూనే ఉంటారు.

TeluguStop.com - Rakul Preet Singh Social Media Followers Drugs Case

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇన్‌ స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌ గా ఉంటుందనే విషయం తెల్సిందే.ఆమె తన థ్రూ బ్యాక్‌ ఫొటోలను మరియు షొటో షూట్ లను మరియు హ్యాపెనింగ్‌ ఫొటోస్‌ ను రెగ్యులర్‌ గా ఈ అమ్మడు షేర్‌ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఆమె డ్రగ్స్‌ కేసులో విచారణ ఎదుర్కొన్న విషయం తెల్సిందే.అప్పటి నుండి ఈమె సోషల్‌ మీడియాలో కనిపించడం లేదు.

TeluguStop.com - సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్న రకుల్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇన్‌ స్టా, ఫేస్‌ బుక్‌ ట్విట్టర్‌ మరియు ఇతర ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ లపై కూడా ఆమె కనిపించడం లేదు.ఎందుకంటే ఆమెను సోషల్‌ మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు.

ఆ విషయంలో రకుల్‌ ఎందుకు ఇన్వాల్వ్‌ అవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని చాలా మంది నెటిజన్స్‌ ఆమెను ప్రశ్నిస్తున్నారు.
సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడితే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఈ సమయంలో ఏ పోస్ట్‌ పెట్టినా కూడా ఆమెను నెటిజన్స్‌ ఒక ఆట ఆడుకునే అవకాశం ఉందని భావిస్తున్నట్లుగా ఉంది.

అందుకే ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అంటేనే బాబోయ్‌ అంటుంది.ప్రస్తుతం ఈమె ముంబయిలోనే ఉంది.మరో రెండు మూడు రోజుల్లో వైష్ణవ్‌ తేజ్‌ సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ రాబోతుంది.క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్న సమయంలోనే ఎన్‌ సీ బీ వారు విచారణకు నోటీసులు పంపడంతో ఆమె ముంబయికి వెళ్లింది.

ప్రస్తుతం ఆమె సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోవర్స్‌ కు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్న కారణంగా ఆమెను కొందరు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటి వరకు తనపై వచ్చిన వార్తలను ఆమె కొట్టి పారేయకుండా అలాగే ఉంటుంది.

కనుక ఆమెను కొందరు డ్రగ్స్‌ రాకెట్‌ తో సంబంధం ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు.ఈ విషయమై ఆమె స్పందన ఏంటో చూడాలి.

#Social Media #Followers #ReasonBehind #Drugs Case #NCB Officials

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rakul Preet Singh Social Media Followers Drugs Case Related Telugu News,Photos/Pics,Images..