రకుల్ చేతిలో మూడు బాలీవుడ్ సినిమాలు  

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.ఈ అమ్మడు చేసినవి కొన్ని సినిమాలే అయినా అందరూ స్టార్ హీరోలతోనే సందడి చేసింది.

TeluguStop.com - Rakul Preet Singh Signed Three Hindi Movies

సందీప్ కిషన్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు అందరితో ఆడిపాడింది.ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నితిన్ కి జోడీగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ సినిమాతో పాటు వైష్ణవ్ తేజ్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలో హీరోయిన్ గా నటించింది.

కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.అయితే తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశాలు తగ్గిన బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోలతో వరుస అవకాశాలు సొంతం చేసుకొని అక్కడ పాగా వేయడానికి సిద్ధం అవుతుంది.

TeluguStop.com - రకుల్ చేతిలో మూడు బాలీవుడ్ సినిమాలు-General-Telugu-Telugu Tollywood Photo Image

వచ్చే ఏడాది మొత్తం రకుల్ ప్రీత్ సింగ్ పూర్తిగా బాలీవుడ్ సినిమాల మీదనే ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది

ప్రస్తుతం బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తున్నట్టు రకుల్ తెలిపింది.జాన్ అబ్రహాం హీరోగా రూపొందుతున్న ఎటాక్, అమితాబ్- అజయ్ దేవగణ్ కలసి నటిస్తున్న మేడే సినిమాలతో పాటు, అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్న మరో సినిమాలో కూడా నటిస్తున్నానని చెప్పింది.

ఈ మూడు సినిమాల కారణంగా వచ్చే ఏడాది తెలుగు సినిమాలపై దృష్టి పెట్టలేకపోతున్నట్లు ఆమె పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.మోహన్ బాబు సన్నావ్ ఇండియా సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ వార్తలు రావడంతో వాటికి ఫుల్ స్టాప్ పెట్టె క్రమంలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ ల గురించి రకుల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

సన్నాఫ్ ఇండియాలో నటించడం లేదని తేల్చి చెప్పేసింది.

#South Heroines

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు