అవకాశాలు లేవన్న కామెంట్స్ పై సీరియస్ అయిన రకుల్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశాలు తగ్గిపోయాయని తాజాగా కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచారం చేసాయి.ఆమెకి పెద్దగా ఆఫర్స్ తెలుగు నుంచి రావడం లేదని టాక్ నడిచింది.

 Rakul Preet Singh Serious On Rumors-TeluguStop.com

బాలీవుడ్ మీద దృష్టి పెట్టడంతో తెలుగు దర్శకులు రకుల్ ని పక్కన పెట్టారని కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడిచింది.ఈ వార్తలపై తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ గరంగరం అయ్యింది.

తెలుగులో తనకి ఆఫర్స్ రావడం లేదని తానే చెప్పినట్లు ఓ ఇంగ్లీష్ పత్రిక ప్రచురించిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.తెలుగులో తనకి అవాకాశాలు రావడం లేదని నేను ఎప్పుడు చెప్పాను అంటూ ప్రశ్నించింది.

 Rakul Preet Singh Serious On Rumors-అవకాశాలు లేవన్న కామెంట్స్ పై సీరియస్ అయిన రకుల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక నటి ఏడాదిలో ఎన్ని సినిమాలు చేయగలదో తెలుసా.ప్రస్తుతం నేను ఆరు సినిమాలు చేస్తున్న వీటికే డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుంది.

మీకు ఏమైనా తెలిస్తే మా టీమ్ తో మాట్లాడి డేట్స్ అడ్జస్ట్ చేయండి అంటూ కౌంటర్ ఇచ్చింది.

ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ పై స్పందించారు.

మీకు రీసెంట్ గా మా ఫ్రెండ్ కథ చెప్పారు.అది నచ్చినా కూడా కాల్ షీట్స్ లేక చేయలేకపోయారు.

ఆ విషయం నాకు తెలుసు.ఇలాంటి వార్తలపై రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్స్ చేశారు.

ఇదిలా ఉంటే రకుల్ పోస్ట్ ద్వారా ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆరు సినిమాల వరకు ఉన్నాయని కన్ఫర్మ్ అయ్యింది.వాటిలో మూడు సినిమాలు హిందీలోనే చేస్తూ ఉండటం విశేషం.

మిగిలిన సినిమాలు ఏబాషలలో చేస్తుంది అనేది ఆమె చెబితేనే క్లారిటీ వస్తుంది.మొత్తానికి రకుల్ ఇచ్చిన కౌంటర్ ద్వారా ఆమెకి అవకాశాలు రావడం లేదని విమర్శలు చేసిన అందరూ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

ఇక ఈ విషయంలో నెటిజన్లు కూడా రకుల్ ప్రీత్ సింగ్ కి మద్దతుగా నిలవడం విశేషం.

#Rumors #RakulPreet #Harish Shankar #RakulPreet #RakulPreet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు