సాకులు చెబుతున్న రకుల్.. సమన్లు ఇంకా అందలేదట!  

rakul preet singh said no acb summons received Raku Preeth Singh, NCB, Officers, Sushanth Singh Rajputh, Sraddha Kapoore, Deepkia Padukune, Sara Alikhan, NCB Noticess, Non Bailable Warrent, - Telugu Deepkia Padukune, Ncb, Ncb Noticess, Non Bailable Warrent, Officers, Raku Preeth Singh, Sara Alikhan, Sraddha Kapoore, Sushanth Singh Rajputh

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని రోజుల క్రితం తనకు కనీసం పొగ తాగే అలవాటు కూడా లేదని పొగే తాగని తాను డ్రగ్స్ ఎలా తీసుకుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఎన్సీబీ అధికారులు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని విచారించి రకుల్ తో పాటు మరో ముగ్గురు హీరోయిన్లకు నోటీసులు పంపారు.

TeluguStop.com - Rakul Preet Singh Said No Acb Summons Received

శ్రద్ధా కపూర్,దీపికా పదుకునే ,సారా అలీఖాన్ లకు కూడా ఇప్పటికే నోటీసులు అందాయి.

అయితే ఎన్సీబీ నోటీసులు జారీ చేయడంతో రకుల్ కొత్త రాగం మొదలుపెట్టింది.

TeluguStop.com - సాకులు చెబుతున్న రకుల్.. సమన్లు ఇంకా అందలేదట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తనకు ఇప్పటివరకు ఎన్సీబీ అధికారుల నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని పేర్కొంది.నిజానికి ఈరోజే రకుల్ ఎన్సీబీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది.

కానీ ఆమె నోటీసులకు స్పందించకపోవడంతో రేపు ఆమెను విచారించాలని ఎన్సీబీ అధికారులు భావిస్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వేర్వేరు మార్గాల ద్వారా రకుల్ కు నోటీసులు అందజేసేందుకు ప్రయత్నించింది.

అయితే రకుల్ మాత్రం స్పందించకుండా తప్పించుకుంది.మళ్లీ తనకే పాపం తెలియనట్లు నోటీసులు అందలేదని సాకులు చెబుతోంది.రకుల్ ప్రత్యక్షంగా వెల్లడించక పోయినా రకుల్ మేనేజర్ హైదరాబాద్ లో కానీ ముంబైలో కానీ ఆమెకు ఎలాంటి సమన్లు రాలేదని పేర్కొన్నారు.రకుల్ రేపైనా విచారణకు హాజరవుతుందో లేక సమన్లు అందలేదని సాకులు చెబుతుందో చూడాల్సి ఉంది.

ఎన్సీబీ అధికారులు వాట్సాప్ ద్వారా ఆమెకు ఇప్పటికే నోటీసులు పంపించామని.రకుల్ కేసును తప్పుదోవ పట్టిస్తోందని.ఇదే విధంగా ఆమె ప్రవర్తిస్తే నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.రకుల్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ యాడ్ షూట్ లో పాల్గొంటున్నట్టు సమాచారం.

మరోవైపు డ్రగ్స్ కేసులో రకుల్ కు నోటీసులు అందడంపై నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

#NCB Noticess #NonBailable #Officers #Sraddha Kapoore #Sara Alikhan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rakul Preet Singh Said No Acb Summons Received Related Telugu News,Photos/Pics,Images..