రకుల్ పాప సగం తీసేసిందిగా!  

Rakul Preet Singh Reduces Half Salary, Rakul Preet Singh, Remuneration, Manmadhudu 2, Indian 2 - Telugu Indian 2, Manmadhudu 2, Rakul Preet Singh, Remuneration

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో ఎంత త్వరగా స్టార్ స్టేటస్‌ను తెచ్చుకుందో అంతే త్వరగా ఇండస్ట్రీ నుండి ఫేడవుట్ అయ్యింది.ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో ఒక్క ఆఫర్ కూడా లేకపోవడంతో ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ నెట్టుకొస్తుంది.

 Rakul Preet Singh Reduces Half Salary

కాగా తమిళంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఇండియన్-2’లో నటిస్తున్న ఈ బ్యూటీ, బాలీవుడ్‌లోనూ ఒకట్రెండు సినిమాలను లైన్‌లో పెట్టింది.అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యింది.

దీంతో రకుల్ తన నెక్ట్స్ చిత్రాల కోసం రెడీ అవుతోంది.కాగా ప్రస్తుత పరిస్థితుల కారణంగా సినిమాలను తెరకెక్కించేందుకు ప్రణాళిక రెడీ చేస్తోంది.ఇందులో భాగంగా తన రెమ్యునరేషన్‌ను సగానికి సగం తగ్గించేందుకు రకుల్ సిద్ధమైంది.దీనికి సంబంధించి ఆమె ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయకపోయినా, చిత్ర వర్గాల్లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.

రకుల్ పాప సగం తీసేసిందిగా-Gossips-Telugu Tollywood Photo Image

సినిమా అవకాశాలు లేకపోవడంతోనే రకుల్ ఇలా రెమ్యునరేషన్ తగ్గించుకుందని కొందరు అంటున్నారు.

ఏదేమైనా కరోనా వైరస్ ప్రభావంతో రకుల్ తీసుకున్న నిర్ణయాన్ని ఇతర హీరోయిన్లు కూడా ఆచరిస్తే నిర్మాతలకు చాలా మంచి చేసిన వారు అవుతారని పలువురు కామెంట్ చేస్తున్నారు.

ఇక ఇండియన్-2 చిత్రంలో రకుల్ యంగ్ హీరో సిద్ధార్థ్‌కు జోడీగా నటిస్తోంది.స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని రకుల్ గతంలోనే తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

కాగా తెలుగులో అక్కినేని నాగార్జునతో కలిసి మన్మధుడు-2 చిత్రంలో నటించిన రకుల్, మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు.

#Remuneration #Indian 2 #Manmadhudu 2

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rakul Preet Singh Reduces Half Salary Related Telugu News,Photos/Pics,Images..